Breaking News

నిషెదిత ఉత్పత్తులను అమ్మినా, నిల్వ చేసినా చర్యలు తప్పవు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల పరిసరాలలో పోగాకు, గుట్కా, ఖైనీ వంటి నిషెదిత ఉత్పత్తుల అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సబ్‌ కలెక్టర్‌ జి సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ హెచ్చరించారు. స్థానిక మాంటిస్సోరి కళాశాల ఆడిటోరియంలో శనివారం పాన్‌షాప్‌, బడ్డి కొట్ల వ్యాపారస్తులతో పోగాకు, గుట్కా, ఖైనీ వంటి నిషెదిత ఉత్పత్తుల అమ్మకాలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల వాడకానికి బానీసలు అయి తమ అమూల్యమైన జీవితాలను పాడుచేసుకుంటున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను చేసి వాటి అమ్మకాలపై నిషెదం విధించినప్పటికి కొత్త మంది వ్యాపారస్తులు ఆనధికారకంగా అమ్మకాలను సాగిస్తున్నారని అటువంటి వారిపై సిఓటిపిఏ యాక్ట్‌ ` 2003 ప్రకారం కఠినంగా శిక్షింపబడతారని సబ్‌ కలెక్టర్‌ హెచ్చరించారు. నిషెదిత ఉత్పత్తులను అమ్మినా, నిల్వ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలు, విద్యా సంస్థలు దేవాలయ ప్రాంగణ ప్రాంతాలలో అమ్మకాలు నిర్వహించకుండా ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్‌ అధికారులను సబ్‌ కలెక్టర్‌ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హంద్రీనీవా జలాలకు సీఎం జల హారతి

-కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ప్రత్యేక పూజలు -బీరగానిపల్లె రిజర్వాయర్ శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *