Breaking News

అన్ని అవయవాల్లో కెల్ల నయనం ప్రధానం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వెన్నెల కంటి ఆసుపత్రికి చెందిన డా: ఉపేందర్ చే విజయవాడ ప్రకాశం బ్యారేజి కి చేరువలో గల “చిగురు బాలల గ్రామం” నందు సుమారు 70 మంది పిల్లలకు ఉచిత కంటి పరీక్ష మరియు మందుల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించినట్లు ట్రస్ట్ అధినేత అరసవిల్లి అరవింద్ తమ కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా అరసవిల్లి అరవింద్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవ కార్యక్రమాలలో భాగంగా చిగురు ఆర్ఫన్ హౌజ్ పిల్లల గురించి తెలిసి వారికి గల కంటి సమస్యలకు పరిష్కారం చూపించాలనే ఉద్దేశం తో ఈ రోజు ఉచిత కంటి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో సంతృప్తిని కలిగిస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఫన్ హౌజ్ ఇంఛార్జి అనిల్ పాల్గొని ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *