జగనన్న విద్యాదీవెన లబ్దిదారులకు రూ. 4 కోట్ల 64 వేల రూపాయలు విడుదల…

-మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తో కలసి చెక్కు అందించిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని శ్రీ పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాల నందు జగన్నన్న విద్యా దీవెన 2వ విడత కార్యక్రమములో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన మండలి మొహమ్మద్ రుహుల్లా, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 5195 లబ్ధిదారులకు రూ. 4 కోట్ల 64 వేల రూపాయలు విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రాథ‌మిక విద్య నుంచి విదేశీ విద్య వ‌ర‌కు అన్ని ద‌శ‌ల‌లోనూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల‌కు చేయూత‌నందిస్తున్నట్లు, మరీ ముఖ్యంగా ఉన్నత విద్య ఎంతో వ్యయ‌ ప్రయాస‌ల‌తో కూడుకున్న ప్రస్తుత త‌రుణంలో.. విద్యాదీవెన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యనందిస్తోన్న ఘనత జగన్ మోహన్ రెడ్డి దే అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అనేక సంక్షేమ పథకములను అమలు చేస్తూ, పేదలు పెద్ద చదువులకు దూరం కాకూడదని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారో అదే విధంగా జగనన్న విద్యా దీవెన ప్రవేశ పెట్టుట జరిగిందని అన్నారు. కార్యక్రమములో దుర్గ గుడి చైర్మన్ పైలా సోమినాయుడు, పలువురు కార్పొరేటర్లు, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *