-పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రతో తాడేపల్లి ప్యాలెస్ లో టెన్షన్
-జనసేనకు వస్తున్న జనాదరణ చూసి వైసీపీ నేతలు వణికిపోతున్నారు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర దెబ్బకి తాడేపల్లి ప్యాలెస్ భయంతో వణికి పోతోందని పార్టీ అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అనేసరికి ప్యాంట్లు తడిచిపోతున్నాయన్నారు. ఆయన కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడి భద్రత, భరోసా కల్పించే ప్రయత్నం చేస్తుంటే- వైసీపీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, అవాకులుచవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 3 వేల మంది కౌలు రైతుల ఆత్మహత్యలు ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. జనసేనకు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకే వైసీపీ నాయకులు అర్ధంపర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. జగన్ రెడ్డి రాక్షస పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగాలంటే ప్రజలంతా పవన్ కళ్యాణ్ కి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి రూ. లక్ష ఆర్థిక సాయం చేసి భరోసా కల్పించి వారందరికీ అండగా నిలుస్తుంటే వైసీపీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో 3 వేల మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా? వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోబట్టే 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న మీరు రైతులకు ఏ విధంగా అండగా నిలిచారో సమాధానం చెప్పాలి. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది రైతు ద్రోహి ప్రభుత్వం కాదా? వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వారు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ ప్రతి జిల్లాకి వెళ్తున్నారు. ఎంత మంది ఆత్మహత్య చేసుకుంటే అంత మందికి రూ.లక్ష తన సొంత డబ్బు నుంచి అందిస్తున్నారు. ఆయన సంపాదించిన డబ్బు నుంచి రైతులకు మద్దతు ఇస్తుంటే, అది చూసి రైతులు నుంచి వస్తున్న ఆదరణ చూసి వైసీపీ నాయకులు నోళ్లకు పని చెబుతున్నారు. మరోసారి చెబుతున్నాం రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మాత్రమే పవర్ ఛేంజర్, గేమ్ ఛేంజర్. ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టే అధికార మార్పిడి జరుగుతుంది. వైసీపీని గద్దె దించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతాం అన్నారు.
Prajavartha Online Telugu News