Breaking News

35వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి మెరుగ నాగార్జున

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
35వ డివిజన్ పరిధిలో సుమారు రూ 227.71 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి మెరుగ నాగార్జున, శాసన సభ్యులు  వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ వై.ఎస్. జగన్ పరిపాలన విజయవాడ నగరం అభివృద్ధి దిశగా పయనిస్తుందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా నగరపాలక సంస్థ అనేక పనులు చేపట్టి వాటిని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని గంటి వారి వీధి, కౌతా సుబ్బారావు వీధి, పింగళి స్వామి వారి వీధి, గుర్రాల వారి వీధి, లక్ష్మణరావు వారి వీధి, కర్లపాలెం వారి వీధి, మంచాల వారి వీధి, పూనూరి వారి వీధి మరియు కత్తి రామయ్య వీధి లో నూతనంగా నిర్మించిన సిమెంటు రోడ్లను, డ్రయిన్లతో పాటుగా కౌతా సుబ్బారావు స్కూల్ మరమ్మత్తులు నిర్వహించుట మంత్రిచే శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. అదే విధంగా మేయర్ రూ 227.71 లక్షలతో ఈ డివిజన్ యందలి సి.సి. రోడ్లు నిర్మాణం మరియు స్కూల్ ఆధునీకరణ పనులు చేపట్టుట జరిగిందని, పశ్చిమ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలియజేసారు. గతంతో పోల్చితే పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని మాజీ మంత్రివర్యులు సారధ్యంలో అన్ని డివిజన్ లను అభివృద్ధి పరచుట జరుగుతుందని అన్నారు. కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్ బలసాని మణిమ్మతో పాటుగా పలువురు కార్పొరేటర్లు అధికారులు మరియు స్థానిక వై.సి.పి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *