విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని,విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి సీ సి రోడ్లు, మంచినీటి పైప్ లైన్లు,సైడ్ డ్రైనేజ్ పనులు చేపడుతున్నామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం 19వ డివిజన్ జార్జిపేట నందు జరిగిన సీ సీ రోడ్డు శంకుస్థాపన, మరియు గ్రీన్ ల్యాండ్ ప్రాంతంలో 40 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న మంచినీటి పైప్ లైన్ పనులకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తో కలిసి అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 14 సంవత్సరాలు గా ఇక్కడి ప్రజలు మంచినీటి సమస్య తో ఇబ్బందులు పడుతున్నారు అని గత ప్రభుత్వం లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి ఇక్కడి పెద్దలు ఎన్నిసార్లు తీసుకెళ్లిన ఆయన పట్టించుకోలేదని అన్నారు.వైసీపీ ప్రభుత్వ కార్పొరేటర్ గా 19వ డివిజన్ లో రెహనా నహిద్ గెలిచిన తర్వాత కౌన్సిల్ లో కృషి చేసి నిధులు మంజూరు చేపించారని చెప్పారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి మంచినీటి సమస్యా కు శాశ్వత పరిష్కారం అందుతుంది అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం,స్థానిక కార్పొరేటర్ రెహెనా నాహీద్,కో ఆప్షన్ సభ్యులు అలీమ్ మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News