గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం

-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చొరవతో పలువురికి కుల ధ్రువీకరణ పత్రాల జారీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా పరిష్కారాలు లభిస్తున్నాయి. కుల ధ్రువీకరణ పత్రాలు రాక, ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్న పలువురు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తమ సమస్యలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన తక్షణమే రెవెన్యూ ఉన్నతాధికారులతో మాట్లాడటం జరిగింది. దీంతో ఆరుగురు దరఖాస్తుదారులకు కొత్త కులధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి. వీటిని ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో దరఖాస్తుదారులకు గురువారం అడిషనల్ కమిషనర్(జనరల్) శ్యామల, నార్త్ తహశీల్దార్ దుర్గాప్రసాద్, సెంట్రల్ తహశీల్దార్ శ్రీనివాస్ వెన్నెలతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. సమస్యను తన దృష్టికి తీసుకువచ్చిన వెనువెంటనే పరిష్కారం చూపడంపై దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *