ముఖ్యమంత్రి సహాయనిధితో పేదలకు మేలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 4 లక్షల విలువైన ఎల్ఓసి పత్రం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి సహాయనిధి వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ కు చెందిన చిన్నారి మహమ్మద్ నవాజున్నీసా(7) పుట్టుకతోనే వినికిడి సమస్యతో మాటలు రాకుండా ఇబ్బంది పడుతోంది. పాప కుటుంబ ఆర్థిక దుస్థితిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా.. రూ. 4 లక్షల విలువైన ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఎల్ఓసి పత్రాన్ని పాప తండ్రి మహమ్మద్ అతావుల్లాకు గురువారం ఎమ్మెల్యే అందజేశారు. వివిధ కారణాల చేత పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్నప్పుడు వారికి ఆర్థిక భారం విపరీతంగా పడుతుందని, అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి ఉదారంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి కోట్లాది రూపాయలు అందజేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. రాష్ట్రంలోనే సీఎంఆర్ఎఫ్ నిధులు పొందడంలో సెంట్రల్ నియోజకవర్గం అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 881 మందికి రూ. 4 కోట్ల 8 లక్షల 60 వేల రూపాయలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. 86 మందికి రూ. 2 కోట్ల 23 లక్షల 12 వేల రూపాయలకు సంబంధించి ఎల్ఓసి పత్రాలను అందించినట్లు చెప్పారు. కనుక ఆపద వస్తే అధైర్యపడకుండా.. ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న తమకు చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి పాప కుటుంబసభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *