-వార్డు గ్రామ సచివాలయాల్లో జూన్ 23 వరకు దరఖాస్తులు స్వీకరణ
-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం క్రింద అర్హులైన (45-60 సం.ల మధ్య వయసు ) కలిగిన ఓసి – కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులములకు చెందిన మహిళా లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో తెలియచేశారు
2020-21 సం. నుండి వైఎస్ఆర్ కాపు నేస్తం కింద 45-60 సం. ములు మధ్య ఉన్న ఓసి – కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులములకు చెందిన అర్హులైన మహిళల ఒక్కొక్కరికి రూ.15,000 /-ల ఆర్ధిక సహాయం చేసే కార్యక్రమాన్ని రాష్ట్రముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా ప్రారంభించడం జరిగిందన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో మొదటి సంవత్సరము 2020-21 గాను 28,567 లబ్దిదారులకు రు.42.85 కోట్లు ; 2021-22 గాను 26,525 లబ్దిదారులకు రు. 39.79 కోట్లు నేరుగా మహిళా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలకు జమ చేయడమైనదని తెలియచేశారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 3 వ విడత విడుదలకు షెడ్యూల్ విడుదల చేస్తూ జూన్ 23 వ తేదీ వరకు ధరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించియున్నారు. ఈ సందర్భములో కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి కులములకు చెందిన మహిళా లబ్దిదారులకు తెలియజేయునది ఏమనగా, కుల ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు, ఆధార్ కార్డులు తీసుకుని దరఖాస్తు చేయుటకు మీ గ్రామ/వార్డు వాలంటీరు (లేదా) మీ గ్రామ/వార్డు సంక్షేమ కార్యదర్శులను సంప్రదించవలసినదిగా తెలియచేసి ఉన్నారు. ది. 23.06.2022 లోగా సంబందించిన వివరాలు అందజేయాలని తెలియజేయలని జిల్లా కలెక్టర్ కె.మాధవీలత. ఆ ప్రకటనలో తెలిపారు.
ఈ మొత్తం ప్రక్రియను జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సంస్థ, రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా వారి ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలియచేశారు.
Prajavartha Online Telugu News