-హౌసింగ్ సంబందించిన 18% స్టేజ్ కన్వర్షన్ సాధించారు
-స్టేజ్ కన్వర్షన్ లక్ష్యాల ను రెండంకెల నుంచి మూడంకేలు చేరుకోవాలి
-జాయింట్ కలెక్టర్ శ్రీధర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఓ టి ఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాజమండ్రి డివిజన్ కు చెందిన 1510, కొవ్వూరు డివిజన్ కు చెందిన 189 డాక్యుమెంట్లు ఆయా మండలాలు అందచెయ్యడం జరిగిందని జాయింట్ కలెక్టర్ సి.హెచ్. శ్రీధర్ పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఓటీఎస్ రిజిస్ట్రేషన్లు, జగనన్న గృహ నిర్మాణాల స్టేజ్ కన్వర్షన్ పురోగతిపై కొవ్వూరు, రాజమహేంద్రవరం ఆర్డీవోలు, డ్వామా, హౌసింగ్, తాసిల్దార్ లు, ఎంపీడీవో చేపట్టాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ సమీక్ష చేస్తూ, జిల్లాలో మంగళవారం సాయంతరానికి నిర్దేశించిన 1700 ఓటీఎస్ రిజిస్ట్రేషన్స్ లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. రాజమండ్రి డివిజన్ కు సంబందించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఆయా మండలాలకు పంపడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ మంగళ వారం సాయంత్రం సమీక్ష చేసే సమయానికి 100% లక్ష్యాలు పూర్తి చెయ్యాలని, ఇందుకోసం గ్రామ సహాయకులు, పంచాయతీ కార్యదర్శుల కు లక్ష్యాలను రాత్రికే నిర్దేశించా ల్సి ఉందన్నారు. రాజమండ్రి అర్బన్ లో 34,రూరల్ లో 156, కోరుకొండ – 436, కడియం 143, అనపర్తి 126, రాజానగరం 88, బిక్కవోలు 358, రంగంపేట 38, గోకవరం 66 మొత్తం 1510 ఓ టి ఎస్ డాక్యుమెంట్ లను పంపామని తెలిపారు.
కొవ్వూరు డివిజన్ పరిధిలో మొత్తం 189 డాక్యుమెంట్లు పంపగా నిడదవోలు 36, పెరవలి 41, కొవ్వూరు 13, గోపాలపురం 29, తాళ్లపూడి 9, దేవరపల్లి 2 , నల్లజర్ల 29 ఉండ్రాజవరం 23 ఓ టి ఎస్ పత్రాలు అందజేశారన్నారు.
జగనన్న గృహానిర్మాణాల లక్ష్య సాధనలో
స్టేజ్ కన్వర్షన్ పై మరింత దృష్టి పెట్టాలని జేసీ శ్రీధర్ పేర్కొన్నారు. కలెక్టర్ గృహ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, అన్ని గ్రౌండింగ్ చెయ్యాల్సి ఉంటుందని స్పష్టం చేశారన్నారు. అందులో భాగంగా స్టేజ్ కన్వర్షన్ కు సంబంధించి 18% ప్రగతి సాధించినా, ఇంకా ప్రగతి దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింగల్ డిజిట్, డబుల్ డిజిట్స్ ఉన్న మండలాలు త్రిబుల్ డిజిట్స్ కు చేరుకోవాలని ఆదేశించారు. జిల్లా సగటు 18%శాతం ఉండగా, చాగల్లు మండలం లో కేవలం 9%శాతం, కొవ్వూరు 11% మేర స్టేజ్ కన్వర్షన్ చెయ్య గలిగారని పేర్కొన్నారు. గత నాలుగు రోజులుగా క్షేత్ర స్థాయి లో అధికారులు కొంత ప్రగతి చూపినా, మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్డీవో లు, హౌసింగ్ అధికారులు సరైన ప్రణాళికలు తయారు చేసి, క్షేత్ర స్థాయి లో అమలు చెయ్యాలని స్పష్టం చేశారు. మండల స్థాయి అధికారుల మధ్య మరింత సమన్వయం ఉండాలని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News