వారానికి ఐదు పని దినాలు మరో ఏడాది పొడిగింపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదు పని దినాలు విధానాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ నెల 27 నుండి మరో ఏడాది పాటు వారానికి ఐదు పని దినాలు విధానం అమల్లో ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ గురువారం ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య.58 ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లలలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అమరావతి రాజధాని ప్రాంతంలోని ఇతర ప్రభుత్వ సంస్థలు ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేసే విధంగా వారానికి ఐదు పని దినాల విధానం వర్తిస్తుందని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *