విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
SRR & CVR కళాశాలలో కోఎడ్యుకేషన్ విధానాన్ని యథావిధిగా కొనసాగించనున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. SRR & CVR కళాశాల నందు విద్యను అభ్యసిస్తున్న వారిలో అధిక శాతం బాలురే ఉన్నారని.. కనుక జీవో నెం.85పై పున: పరిశీలన చేయవలసిందిగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ని ఆదివారం ఎమ్మెల్యే మల్లాది విష్ణు కలిసి రిప్రజెంటేషన్ అందించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన ఆయన కోఎడ్యుకేషన్ విధానాన్ని కొనసాగించే విధంగా చూస్తామని తెలియజేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. కనుక విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. త్వరలోనే అడ్మిషన్లు పున: ప్రారంభమవుతాయని తెలియజేశారు.
Prajavartha Online Telugu News