విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మేకపాటి విక్రమ్ రెడ్డిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందించారు. సోమవారం శాసనసభలో మేకపాటి విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆయనను మల్లాది విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు. భారీ మెజారిటీతో గెలిచిన విక్రమ్ రెడ్డికి ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందనడానికి ఆత్మకూరు ఉప ఎన్నికే ఒక ఉదాహరణ అని మల్లాది విష్ణు చెప్పారు. విక్రమ్ రెడ్డికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశంలో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా అభిలషించారు.
Prajavartha Online Telugu News