-జాయింట్ కలెక్టర్ యస్. నూపూర్ అజయ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నాడు- నేడు రెండవ దశ కింద నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి అవసరమైన మెటల్‌ను సకాలంలో సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ యస్. నూపూర్ అజయ్ కుమార్ క్వారీయజమానులను కోరారు.
నాడు -నేడు పథకం కింద అదనపు తరగతి గదుల నిర్మాణానికి మెటల్ రేట్ల నిర్థారణ సరఫరాపై సోమవారం జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్లో క్వారీయజమానులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నాడు -నేడు పథకం కింద 465 అదనపు తరగతి గదులను నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను సంబంధిత అధికారులు చేపట్టడం జరిగిందన్నారు. నిర్మాణానికి అవసరమైన 10 యంయం 20 యంయం 40 యంయం సైజ్ మెటల్‌ను క్వారీయజమానులు నిర్థేశించిన రేట్లకు సరఫరా చేయాలన్నారు. ఒక్కొక్క యూనిట్ 10 యంయం సైజ్‌కు 1350 రూపాయలు, 20 యంయం సైజ్‌కు 2,600 రూపాయలు, 40 యంయం సైజ్‌కు 1,500 రూపాయలకు సరఫరా చేసేలా జిల్లా స్థాయి టెండర్ కమిటీ రేట్లను నిర్థారించడం జరిగిందన్నారు. నిర్థారించిన రేట్లకు క్వారీయజమానులు మెటల్‌ను సరఫరా చేసేందుకు సుముఖత వ్యక్తం చేసి అదనపు తరగతి గదుల నిర్మాణంలో భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు. అదనపు తరగతి నిర్మాణానికి ప్రభుత్వం నిధులను ఎప్పటికప్పడు విడుదల చేస్తుందని క్వారీయజమానులు కంకరను సరఫరా చేసి న వెంటనే బిల్లులకు చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ తెలిపారు.
సమావేశంలో డిఇవో సివి రేణుక, గనుల శాఖ సహాయ సంచాలకులు సుబ్రమణ్యేశ్వరరావు, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, క్వారీ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు, క్వారీ యజమానులు ఉన్నారు.
Prajavartha Online Telugu News