నియోజక వర్గ, మండలస్థాయి ప్రత్యేక అధికారులు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత, అభివృద్ధి కార్యక్రమాల లక్ష్యాలన్నింటిని గుణాత్మకంగా సాధించడానికి నియోజక వర్గ, మండలస్థాయి ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత మంగళ వారం ఒక ప్రకటనలో తెలియచేశారు.

జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ఫ్లాగ్‌షిప్ (ప్రభుత్వ ప్రాధాన్యత) కార్యక్రమాలు, నాడు- నేడు, గ్రామ మరియు వార్డు సచివాలయాల పనితీరు, గృహనిర్మాణ కార్యక్రమాలు (పేదలందరికీ ఇల్లు) మొదలైన అభివృద్ధి కార్యక్రమాలను అర్హులైన వారికి సమర్థవంతంగా అందించాల్సి ఉందన్నారు.
ఆ దిశలో క్షేత్ర స్థాయిలో సచివాలయ వ్యవస్థ ద్వారా మానవ వనరులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. వారి సేవలు, పనితీరుపై మరింత పర్యవేక్షణ అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం పై పర్యవేక్షణ కోసం తూర్పుగోదావరి జిల్లాలోని 7 నియోజకవర్గాలు, 19 మండలాలకు నియోజక వర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని కలెక్టర్ డా.కె.మాధవీలత తెలిపారు.

నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు మండల మరియు గ్రామ స్థాయిలో అధికారులందరితో సమన్వయం చేసుకుంటూ అన్ని సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తూ సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

నియోజకవర్గపు వారీగా ప్రత్యేక అధికారులు వివరాలు:-
రాజ మహేంద్రవరం అర్బన్ –
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్,

రాజమహేంద్రవరం (రూరల్) నియోజకవర్గానికి రాజమహేంద్రవరం
ఆర్డిఓ ఏ. చైత్ర వర్షిని,

రాజానగరం నియోజకవర్గం.. డిఆర్డిఏ
పిడి – ఎస్. డేగలయ్య,

అనపర్తి నియోజకవర్గం.. డ్వామా
పిడి, .. పి జగదాంబ,

కొవ్వూరు నియోజకవర్గం..
కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు,

నిడదవోలు నియోజకవర్గం..
జిల్లా శిశు అభివృద్ధి అధికారి కె.విజయలక్ష్మి,

గోపాలపురం నియోజకవర్గం..
జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావులను నియమించారు.

మండల వారి ప్రత్యేక అధికారుల వివరాలు :-

రాజమహేంద్రవరం (అర్బన్) నగరపాలక సంస్థ కమిషనర్ కె.
దినేష్ కుమార్,

రాజమహేంద్రవరం (రూరల్) మండలం..ఆర్డీవో ఏ. చైతన్య వర్షిని,

కడియం మండలం.. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వి. రాధాకృష్ణ,

రాజానగరం మండలం.. పి.డి, డిఆర్ డిఎ ఎస్.డేగలయ్య,

సీతానగరం మండలం.. డిడిపశుసంవర్ధక శాఖ(రాజమండ్రి) కే.సత్యనారాయణ,

కోరుకొండ మండలం.. ఏడీఏ (కోరుకొండ) బి.కే. మల్లికార్జునరావు,

అనపర్తి మండలం.. ఏడిఏ (అనపర్తి) డి.వి.కృష్ణారావు,

బిక్కవోలు మండలం..
పీడీ, డ్వామా. పి.జగదాంబ,

రంగంపేట మండలం.. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. ఎస్.టి.జి సత్యగోవిందం,

గోకవరం మండలం..జెడి, మత్స్యశాఖ.. వి.కృష్ణారావు,

కొవ్వూరు మండలం.. ఆర్డీవో ఎస్.మల్లిబాబు,

తాళ్లపూడి మండలం.. ఏడీఏ కొవ్వూరు) పి.చంద్రశేఖర్,

చాగల్లు మండలం.. డిఎం, ఎన్ఆర్ఈడిసిఏపి కే. సత్యనారాయణ,

నిడదవోలు మండలం.. పిడి, ఏపీఎంఐపి.. ఎస్. రామ్మోహన్,

ఉండ్రాజవరం మండలం.. ఎస్.ఈ, ఆర్డబ్ల్యూఎస్.. డి. బాల శంకరరావు,

పెరవలి మండలం.. జిల్లా శిశు అభివృద్ధి అధికారి కే. విజయ్ కుమారి,

గోపాలపురం మండలం.. డిడి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని ఎం.శోభారాణి,

దేవరపల్లి మండలం..
డిడి, పశుసంవర్ధక శాఖ (కొవ్వూరు) డా. జి. రాధాకృష్ణ,

నల్లజర్ల మండలం..
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *