

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బొబ్బిలంక గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ ని తూర్పుగోదావరి జిల్లా డి ఏం & హెచ్ ఒ డాక్టర్ వసుంధర, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి కుమారి, డాక్టర్ ప్రద్యుమ్న సందర్శించారు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది .హెల్త్ క్యాంప్ నందు ఉంచిన మందులను పరిశీలించి అనంతరం గోదావరి ఉధృతిని పరిశీలించి హెల్త్ క్యాంపులో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేయడం జరిగినది మరియు మూలకల్లంక హెల్త్ క్యాంపులో అందిస్తున్న వైద్య సేవలను తెలుసుకొని తగిన సూచనలను, తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు.
Prajavartha Online Telugu News