రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి నది కి వరదల కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గత 12 గంటలుగా విడదల చేసిన నీటి విడుదల వివరాలను జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఉదయం ఒక ప్రకటన లో తెలియచేశారు. 16వ తేదీ శనివారం రాత్రి 8.00 గంటలకు 25.33 లక్షల క్యూసెక్కులు రాత్రి 11 కి 25.59 , అర్ధరాత్రి 12 కి 25.63, ఉదయం 1 గంటకి 25.63, 2 గంటలకు 25.77 , ఉదయం 3 కి 25.80 , ఉదయం 4 కి 25.80, ఉదయం 5 కు 25.8 , ఉదయం 6 కు 25.80 , ఉదయం 7 గంటలకు 25.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందన్నారు. గత 4 గంటలుగా బ్యారేజ్ నుంచి 25.80 లక్షల క్యూసెక్కుల వరద నీటిని స్థిరంగా విడుదల చేయడం జరుగుతోందని తెలిపారు. రాబోయే 48 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News