రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ భేటీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. ఆదివారం విజయవాడ రాజ్ భవన్ కు చేరుకున్న దత్తాత్రేయ బృందానికి రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్యప్రకాష్, రాజ్ భవన్ అధికారులు ఘన స్వాగతం పలికారు. దత్తాత్రేయను శాలువా, జ్ణాపికతో రాష్ట్ర గవర్నర్ ఘనంగా సత్కరించగా, హర్యానా సాంప్రదాయ పద్దతులతో దత్తాత్రేయ రాష్ట్ర గవర్నర్ ను గౌరవించారు. ఈ సందర్భంగా హర్యానా పర్యటనకు రావాలని బిశ్వభూషణ్ హరిచందన్ ను గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. దాదాపు అరగంటపై వీరిరువురు సమకాలీన సామాజిక రాజకీయ అంశాలపై చర్చించారు. విజయవాడ రాజ్ భవన్ నుండి దత్తాత్రేయ నేరుగా గన్నవరం విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *