-ఇకపై వారంలో మూడు రోజులు హౌసింగ్ పై సమీక్ష
-ఇంటి నిర్మాణాలు పురోగతి దిశలో 3వ ఆప్షన్ పైన దృష్టి సారించాలి
-జిల్లా కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలను వేగవంతం చేయాలని , ఆ దిశలో లబ్దిదారులకు అవగాహన కోసం దృష్టి కేంద్రీకరించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవి లత స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జగనన్న గృహ నిర్మాణాలపై హౌసింగ్ ఆధికారులు, నియోజక వర్గ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడీవో ల తో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత అధికారులు తో సమీక్షిస్తూ జిల్లాలో మంజూరైన 48,177 ఇళ్ళ లక్ష్యాలకు గాను పది వేల ఇళ్ల నిర్మాణాలు లబ్దిదారులు పూర్తి చేసారన్నారు. ప్రత్యేక అధికారులు, హౌసింగ్ అధికారులు ప్రతిరోజు గృహ నిర్మాణాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ మండల స్థాయిలో హౌసింగ్, ఎంపీడీవో తహసీల్దార్లు తో సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులకు అవగాహన పెంచాలన్నారు. హౌసింగ్ లే అవుట్ లకు సరైన రహదారి మార్గం ఉండేలా cheyylani ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి, మిగిలిన లబ్ధిదారులకు చైతన్యం తీసుకుని రావాలన్నారు. ఇప్పటి వరకూ గ్రౌండింగ్ అయినా గృహాలను తదుపరి స్టేజీల తీసుకెళ్లేందుకు బేస్మెంట్, రూఫ్, స్లాబ్ స్థాయి కి తీసుకుని వెళ్లాలన్నారు. అవసరమైన పక్షంలో మరికొంత ఆర్థిక చేయూత అందించే క్రమం లో ఎస్ హెచ్ జి రుణా న్ని రూ. 35 వేల నుంచి రూ.50 వేలు అందించే ప్రయత్నం చేయాలని కలెక్టర్ అన్నారు. రాజమహేంద్రవరం డివిజన్ లో 27515 లక్ష్యం కాగా 4387 పూర్తయ్యాయని, మిగిలినలి వివిధ దశల్లో ఉండగా ఇంకా 309 ప్రారంభించాలన్నారు. కొవ్వూరు డివిజన్ లో 20662 లక్ష్యం కాగా 5626 పూర్తయ్యాయని, మిగిలినలి వివిధ దశల్లో ఉండగా ప్రారంభించాలన్నారు. ఇప్పటి ప్రారంభించడానికి ముందుకు రాని లబ్ధిదారులకు అవగాహన కల్పించా లన్నారు. గృహ నిర్మాణాలకు సంబందించి జీయో టాగింగ్ చెయ్యాలన్నారు. గృహ నిర్మాణాలు చేపట్టిన లబ్దిదారులకు రు.35 నుంచి 50 వేల రిపాటల వరకు రుణ సౌకార్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద లే అవుట్స్ లో కాంట్రాక్టర్లు తో మాట్లాడి ఒకే చోట ఎక్కువ సంఖ్యలో గృహాలను నిర్మించేలా వారితో చర్చించాలన్నారు. మండలాలు వారి సమీక్షిస్తూ వారాంతపు లక్ష్యాన్ని నెరవేర్చా అన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో వెనుక బడితే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇసుక సిమెంట్ , ఇనుము కొరత లేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా హౌసింగ్ అధికారి కె. తారా చంద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News