Breaking News

పేదరిక నిర్ములనే లక్ష్యంగా జగనన్న పాలన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదల అభ్యున్నతికి, వారిని సామాజిక,ఆర్థిక ,రాజకీయంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 22వ డివిజన్ 109 సచివాలయం లోని బైరెడ్డి రోడ్, ఆనంద్ భవన్ రోడ్ ప్రాంతంలో ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పేదల అభివృద్ధి కొరకు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా జగన్  అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు వారికి రాజకీయంగా,సామాజిక గౌరవం కల్పిస్తున్నారని అన్నారు.వైసీపీకి బలమైన ఓటు బ్యాంకగా ఉన్న కారణంగా టీడీపీ ప్రభుత్వం లో నిర్లక్ష్యానికి గురైన ఈ డివిజన్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపడుతున్నామని,పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు అందజేసామని అన్నారు. అవినీతి పాలనతో తెలుగుదేశం పార్టీ ప్రజలలో ఆదరణ కోల్పోయింది అని,వారు కేవలం అబద్ధపు ప్రచారాలకు, సోషల్ మీడియాకె పరిమితం అని విమర్శించారు. టీడీపీ పాలనలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి సగం సగం పనులతో రోడ్లు త్రవ్వి అలా వదిలేస్తే వైస్సార్సీపీ వచ్చిన మూడేళ్ళ లో వాటిని సరిచేసి,నూతన అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు.ఓట్ల రాజకీయాలు చేస్తూ ఎన్నికల కు కేవలం మూడు నెలల ముందు పెన్షన్ పెంపు,అన్న కాంటీన్ లను ప్రారంభించిన ప్రజలకు అర్థం అయ్యి తగిన బుద్ధి చెప్పరని అన్నారు.ప్రజలలో జగన్ గారి పట్ల నమ్మకం,విశ్వాసం ఉన్నాయని మరో ముప్పయి సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి, గాంధీ కోపరేటివ్ బ్యాంక్ డైరక్టర్ జోగా రాజు, వైస్సార్సీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,గోపాల్ రెడ్డి, చెన్నారెడ్డి, నాగిరెడ్డి, రమణారెడ్డి, ఫజులుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *