విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు 22వ డివిజన్ లో పర్యటించినప్పుడు కుట్టు మిషన్ తో ఉపాధి పొందే పేద కుటుంబానికి చెందిన యం.సుధ తన మిషన్ రిపేర్ కు వచ్చి జీవనోపాధి కష్టం అవుతుంది అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా తక్షణమే అయన సన్నిహితులు యలమంచిలి జయ సమస్య తెలియజేయగా బుధవారం నాడు వై.యన్.ఆర్ చారిటీస్ ద్వారా దాదాపు 16000 రూపాయల విలువ గల నూతన కుట్టు మిషన్ ను వారికీ అందజేశారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి స్పూర్తితో విజయవాడ నగరంలో ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ నిరుపేదలకు అండగా నిలుస్తున్న యలమంచిలి జయ సేవలు అభినందనీయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొండారెడ్డి,పుప్పాల కుమారి,మాజీ డిప్యూటీ మేయర్ చెల్లారావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News