మహిళా చైతన్యానికి వేదికైన రాజమహేంద్రవరం లో “మహిళా సాధికారత ఉత్సవం”

-ముఖ్యమంత్రి సూచనల మేరకు మహిళా కమిషన్ ద్వారా ఘనంగా ఏర్పాట్లు
-అన్నీ వర్గాలను కలుపుకుని విజయవంతం చేయడానికి మహిళా కమిషన్ అడుగులు
-అక్టోబర్ 1 వ మూడు వేల మంది మహిళలతో బైక్ ర్యాలీ
-” సబల ” రాష్ట్ర స్థాయి లఘు చలన చిత్ర పోటీలు.. చివరి తేదీ సెప్టెంబర్ 25
-మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యంత వేడుకగా రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానం వేదికగా ‘దసరా మహిళా సాధికారత ఉత్సవం’ అక్టోబర్ ఒకటవ జరుపుతున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. ఆదివారం సుబ్రహ్మణ్య మైదానంలో “దసరా మహిళా సాధికారత ఉత్సవం” ఏర్పాట్ల లో భాగంగా రూడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి, తదితరులతో కలిసి పరిశీలించి, అనంతరం విలేఖరుల సమావేశంలో పాల్గొని పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, స్థానిక ప్రముఖులు, న్యాయవాదులు, సైకాలిజిస్టులు, పలు ఎన్జీవోలతో విడివిడిగా సమావేశం అయి “దసరా మహిళా సాధికారత ఉత్సవం” అత్యంత ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ముఖ్యమంత్రి మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుందన్నారు. మహిళల కోసం పోరాటం చేసిన సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు, రాజ్యలక్ష్మి దంపతుల, ఫూలే ల స్ఫూర్తి తో, రాష్ట్రంలోనే తొలిసారిగా ఫూలే విగ్రహం ఏర్పాటు చేసిన రాజమండ్రి లో ఈ కార్యక్రమం ఏర్పాటు చెయ్యాలని ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించగా, భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. రూడా చైర్ పర్సన్ గా ఒక మహిళ కు పదవి ఇవ్వడం, స్త్రీ శక్తికి, ఉద్యమాలకు పురిటి గడ్డ అయినా రాజమండ్రి నే సరైన వేదికగా తొలి వేడుక ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా మహిళా సాధికారిత కి సంబందించిన కార్యక్రమాలను మహిళా కమిషన్ చేపడుతుందని పేర్కొన్నారు. సంప్రదాయ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

సబల” రాష్ట్రస్థాయి  (లఘు చలన చిత్రాలు) పోటీలు:
అదేవిధంగా “సబల” రాష్ట్రస్థాయి (లఘు చలన చిత్రాలు)షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శనతో పాటు, సినీ, కళారంగ ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేస్తామన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే వారికి సెప్టెంబర్ 25 వరకు అవకాశం ఉందని తెలిపారు. ఈ- మెయిల్ apwcshortfilm2022@gmail.com కి పంపడం తో పాటు 9381243599 లేదా 9441356482 కి ఫోన్ చేసి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నని ఆమె తెలిపారు. మహిళలు సమానత్వం, మహిళా సంక్షేమం, మహిళా భద్రత, రక్షణ – దిశ అమలు అనే మూడు అంశాలపై పోటీలకు షార్ట్ ఫిల్మ్ లు పంపవొచ్చునని తెలిపారు. ఎంపిక చేసిన షార్ట్ ఫిల్మ్స్ పోటీల విజేతలకు రూ. 5లక్షల బహుమతులు ప్రధానం, స్ఫూర్తిదాయక మహిళలకు సన్మానించనున్నట్లు తెలిపారు.

రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి మాట్లాడుతూ, సుబ్రహ్మణ్య మైదానంలో ఆరోజు మధ్యాహ్నం నుంచి ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమవు తాయన్నారు. మహిళల బైక్ ర్యాలీ, నారీశక్తిని చాటే కళాప్రదర్శనలు, సాధికారత నృత్యరూపకాలు, వేషధారణలు, వీధినాటికలు, స్టేజీ షోలతో పాటు మహిళల తో కోలాటం, గరగనృత్యం తదితర ప్రదర్శనలు, కబడ్డీ, కర్రసాము, కరాటే వంటి సంప్రదాయ క్రీడలు, స్వయం సహాయక సంఘాలు స్టాల్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు ఉంటుందన్నారు. దాదాపు మూడు వేల మందితో ఈ కార్యక్రమాన్ని జరిపేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు రు మంత్రులు, తదితరులు పాల్గొనడం జరుగుతుందని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు.

బైక్ ర్యాలీ లో కేవలం మహిళలే పాల్గొనాలని, తొలి మూడు స్థానాల్లో గెలుపొందిన మహిళలకి 10, 5, 3 వేలు చొప్పున నగదు బహుమతి అందజేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ, రాష్ట్ర ఖాదీ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్ పిల్లి నిర్మల, స్థానిక మహిళా ప్రముఖులు నిరీక్షణ రెడ్డి, సైకాలిజిస్ట్ అసోసియేషన్ జాతీయ మహిళా విభాగ అధ్యక్షులు డాక్టర్ పద్మ కమలాకర్, రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టి కే. విశ్వేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *