బొబ్బిలంక గ్రామంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం..


రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బుధవారం సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ A.V. చైతన్య, డాక్టర్ N.రాజు మరియు రాధాకృష్ణ CHO సూచనలను అనుసరించి బొబ్బిలంక గ్రామంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలు, స్కూల్స్ నందు ఒకటి నుండి 19 ఏళ్ల పిల్లలు అందరికీ ఉచితంగా నులిపురుగుల నిర్మూలన కొరకు ఆల్బెండజోల్ మాత్రలు బొబ్బిలంక ఉప ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ K. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మందులు మ్రింగించుట జరిగింది. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం గురించి వివరిస్తూ 1  నుండి 19 ఏళ్ల పిల్లలకు నులిపురుగుల నిర్మూలన కొరకు ఆల్బెండజోల్ మాత్రను మ్రింగించుట జరిగింది .ఇది సురక్షితమైన మాత్ర అని వీటిని దగ్గరుండి మింగించవలెనని వారి చేతికి ఇచ్చి ఇంటికి పంపరాదు అని తెలియజేయడం జరిగినది. పిల్లలకు నులిపురుగుల నిర్మూలన వల్ల కలుగు ప్రయోజనాలను వివరిస్తూ మాత్రల వల్ల విద్యార్థులలో రక్తహీనత నివారించవచ్చు అని, పోషకాలగ్రాహ్యత మెరుగుపరుస్తుందని దీనివల్ల పరోక్షంగా చదువుపై ఏకాగ్రత మరియు నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుందని తెలియజేయుట జరిగింది నులిపురుగుల సంక్రమణను తగ్గించుటకు పాటించవలసిన సూత్రాలను MLHP  పి. ప్రశాంతి రత్నం వివరిస్తూ గోళ్ళను చిన్నవిగా శుభ్రంగా ఉంచుకోవాలని ఎల్లప్పుడూ సుబ్రమైన నీటిని త్రాగాలని ఆహారాన్ని ఎప్పుడూ ఈగలు వాడకుండా ఉంచాలని కూరగాయలు పళ్ళు శుభ్రమైన నీటితో కడగాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వివరించుట జరిగింది. హెల్త్ అసిస్టెంట్ V.స్వామి మరియు R. రూపు కుమార్ నులి పురుగు నిర్మూలన కార్యక్రమం గురించి వివరిస్తూ బహిరంగ ప్రదేశాలలో మల మూత్ర విసర్జన చేయరాదని ఎల్లప్పుడూ మరుగుదొడ్డిని ఉపయోగించాలని వివరించుట జరిగింది. ANMలు రాజేశ్వరి, లీలా, మరియు దేవీలు ఈ కార్యక్రమం గురించి వివరిస్తూ ఏదైనా పదార్థం తినే ముందు తిన్న తర్వాత మరియు మరుగుదొడ్డి వాడిన తరువాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని వివరించుట జరిగింది. బొబ్బిలంక H.V S.సూర్య కుమారి వివరిస్తూ డి వార్మింగ్ మాత్ర పిల్లలలో శారీరక మానసిక అభివృద్ధికి దోహదపడుతుందని ఈ మాత్ర గొంతులో ఇరుక్కోకుండా ఉండాలి అంటే బాగా చప్పరించి మంచినీళ్లు త్రాగాలని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి బొబ్బిలంక హెల్త్ సూపర్వైజర్ K.శ్రీనివాసరావు ,S. సూర్య కుమారి, హెల్త్ అసిస్టెంట్స్ V. స్వామి మరియు R. రూప్ కుమార్ లు, ANMలు రాజేశ్వరి, లీలా ,దేవి లు మరియు ఆశా కార్యకర్తలు, అంగనవాడి టీచర్లు పాల్గొన్నారు.

మింగించవలెను.

మాత్రల వలన
అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *