విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ వార్డుల యందు సుమారు 262 మంది వార్డ్వాలెంటిర్ల ఎంపిక కొరకు అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకుల నుండి ఆన్లైన్ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చునని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ ఈ ప్రకటన ద్వారా తెలియజేసారు. వార్డ్వాలెంటీర్ల కొరకు దరఖాస్తు చేసుకొనే వారు 10 వతరగతి (SSC) ఉతీర్ణులై ఉండవలెనని, 22-09-2022 నాటికి 18 సంవత్సరములు నిండి, 35 సంవత్సరములు లోపు గల వారై నగర పరిధిలో నివసించు అభ్యర్థులు మాత్రమే అర్హులు అని ఆసక్తి గల నిరుద్యోగ యువతీ, యువకులు దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబందించి అర్జిదారులు పూర్తి విద్యాఅర్హతల మరియు ఇతర దృవీకరణ పత్రములను జతపరచి http://40.81.241.107/APVOLUNTEER20/apVolunteer090420201049.vt వెబ్సైట్ద్వారా 29-09-2022 తేది లోపుగా దరఖాస్తు చేసుకొనవలెనని తెలియజేసారు. ఇతర వివరాల కొరకు అదనపు కమీషనర్ (P) లేదా వార్డు సెక్రటేరియట్ స్పెషల్ సెల్ ఫోన్ నెంబర్ 8185933187 కు సంప్రదించాలని పేర్కొన్నారు
Tags vijayawada
Check Also
తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్
-క్షేత్రస్థాయి ఆర్ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …
Prajavartha Online Telugu News