26 నుండి చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా మహోత్సవాలు


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఈనెల 26వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు,కార్యదర్శి మరు పిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు చెప్పారు. శనివారం చిట్టినగర్ లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రికను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడు దసరా మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈనెల 26వ తేదీన శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం, 27న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారం,28న శ్రీ గాయత్రీ దేవి అలంకారం, 29న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం,30వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం, అక్టోబర్ ఒకటో తేదీన శ్రీ సంతోషిమాత దేవి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారని చెప్పారు. అలాగే అక్టోబర్ రెండో తేదీన మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతి దేవి అలంకారంతో, మూడో తేదీన శ్రీ దుర్గాదేవి అలంకారం,నాలుగో తేదీన శ్రీ మహిషాసుర మర్ధినిదేవి అలంకారం, 5వ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని వారి వివరించారు. అక్టోబర్ 7వ తేదీ మధ్యాహ్నం దేవస్థానం ప్రాంగణంలో అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. దేవస్థానం ప్రాంగణంలో ప్రతిరోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వ హించనున్నట్లు వివరించారు. కాగా దసరా ఉత్సవాల ప్రసాదాల ప్రత్యేక కౌంటర్ ను ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సమావేశంలో కమిటీ గౌరవ అధ్యక్షులు బెవర సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు మరుపిళ్ళ సత్యనారాయణ, బెవర శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి పొట్నూరి దుర్గాప్రసాద్ ,ఆర్గనైజింగ్ సెక్రటరీ కొరగంజి భాస్కర రావు, కార్యవర్గ సభ్యులు గూడేల రామకృష్ణ (ఆర్కే) ఈది ఎల్లారావు, తొత్తడి భరత్ కుమార్, తమ్మిన సూర్యకుమారి, భోగవల్లి శ్రీధర్, ముదిలి గణేష్, కామందుల నరసింహారావు ,ఈది ఎల్లా రాజారావు, మజ్జి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *