Breaking News

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షలు ప్రశాంతం…

-కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో ఈనెల 16వ తేదీనుండి ఐదు రోజుల పాటు నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించిన్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. ఎస్‌ ఆర్‌ ఆర్‌ అండ్‌ సివిఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న యూనియస్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్ష కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ కుమార్‌లు పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 161 మంది అభ్యర్థులు గాను 160 మంది అభ్యర్థులు మైన్స్‌ పరీక్షకు హాజరు అయ్యారని ఆయన తెలిపారు. పరీక్షలు హాజరైన అభ్యర్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్ల చేయడం జరిగిందని కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. పరీక్షల నిర్వహణకు కేటాయించిన అధికారులు, సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా పనిచేసి పరీక్షలను విజయవంతంగా నిర్వహించారని కలెక్టర్‌ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *