మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
గ్రామాల్లో తాగునీటి పథకాల సక్రమ నిర్వహణకు చర్యలు తీసుకోవాలి. జల జీవన్ మిషన్ కింద ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీటి కొళాయి ఏర్పాటు పనులు వేగవంతం చేయాలి. జడ్పీ స్థాయి సంఘ సమావేశాల్లో చైర్పర్సన్ అధికారులు ఆదేశించారు. కృష్ణాజిల్లా ప్రజాపరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఆదివారం జిల్లా పరిషత్తులో నిర్వహించారు. ప్రణాళిక మరియు ఆర్థికం, గ్రామీణ అభివృద్ధి, విద్యా వైద్యం, పనులు అంశాలపై 1, 2, 4, 7 స్థాయి సంఘాలకు చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షత వహించగా, వ్యవసాయం అంశంపై 3వ స్థాయి సంఘానికి ఉపాధ్యక్షురాలు గరికిపాటి శ్రీదేవి అధ్యక్షత వహించారు. స్త్రీ శిశు సంక్షేమ అంశంపై నిర్వహించిన 5వ స్థాయి సంఘానికి శ్రీమతి గుత్తా సీతారామలక్ష్మి, సాంఘిక సంక్షేమ అంశంపై నిర్వహించిన 6వ స్థాయి సంఘానికి శ్రీ గుదిమళ్ళ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగాయి. జిల్లాలో తాగునీటి పథకాల నిర్వహణ సరిగాలేదని, ఫిల్టరేషన్ సరిగా జరగడం లేదని పలువురు సభ్యులు సమావేశంలో ప్రస్తావించగా తాగునీటి పథకాలు సరిగా నిర్వహించి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా చేయాలని చైర్పర్సన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జలజీవన్ మిషన్ క్రింద జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కుళాయిలు మంజూరు చేసి స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన పనులు వేగవంతం చేయాలన్నారు. జడ్పీటీసీలకు ప్రాధాన్యత విలువ ఇవ్వడం లేదని పలువురు సభ్యులు తన దృష్టికి తెచ్చారని, కాబట్టి ప్రభుత్వపరమైన అన్ని కార్యక్రమాలు సమాచారం సభ్యులకు తెలియజేసి ప్రోటోకాల్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే కలెక్టర్కు రిపోర్ట్ చేస్తామని చైర్పర్సన్ స్పష్టం చేశారు. గత ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని పాఠశాలల్లో నిర్వహించు కార్యక్రమాలకు జడ్పిటిసి సభ్యులకు ఆహ్వానం లేదని సభ్యులు ప్రస్తావించగా, జడ్పిటిసి సభ్యులను తప్పనిసరిగా ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జగనన్న గోరుముద్ద పధకం కింద జిల్లాలో పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరైన పరిమాణంలో సరైన నాణ్యతతో అందించాలని ఎక్కడా ఫిర్యాదులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఒకటి రెండు తరగతులను సమీప పాఠశాలల్లో విలీనం సందర్భంగా అక్కడక్కడ విద్యార్థుల ఇబ్బందులు సభ్యులు ప్రస్తావించగా, ప్రస్తుతం రేషనలైజేషన్ జరుగుతున్నదని విలీన సమస్యలు పరిష్కారం కాగలవన్నారు. జగనన్న గోరుముద్ద పధకం కింద జిల్లాలో పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరైన పరిమాణంలో సరైన నాణ్యతతో అందించాలని ఎక్కడా ఫిర్యాదులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అంగనవాడి కేంద్రాల్లో నిర్దేశించిన సమయపాలన పాటించాలని గర్భవతులకు బాలింతలకు శిశువులకు పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ జరగాలని సూచించారు. నాడు నేడు క్రింద కేటాయించిన నిధులతో సంక్షేమ హాస్టల్లో మరమ్మత్తులు చేపట్టాలి. విద్యతోపాటు క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి గ్రామంలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటుకు సభ్యులు చొరవ తీసుకోవాలని చైర్పర్సన్ సూచించారు. సంబంధిత యాప్ లో స్పోర్ట్స్ క్లబ్ రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా జగనన్న స్పోర్ట్స్ క్లబ్ లోగోను చైర్పర్సన్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో ఇన్చార్జి శ్రీనివాసరావు, జడ్పిటిసిలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News