-జిల్లాలోని పి ఐ ఓ లకు, అప్పిలట్ అధారిటీ లకు అవగాహన తో కూడిన కార్యశాల
– కలెక్టర్ డా కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
సమాచార హక్కు చట్టం 12 వ వార్షకోత్సవ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 6 న అవగాహన కార్యక్రమం, కార్యశాల నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 6 వ తేదీ ఉదయం 10 నుంచి నిర్వహించ తలపెట్టిన కార్యక్రమం సమయాన్ని మార్పు చేస్తూ మ.3.00 నుంచి సా.5.00 వరకు శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. కావున జిల్లా పరిధిలో ఉన్న అందరూ * పి ఐ ఓ లు, అప్పిలట్ అధారిటీ అధికారులు శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం, రాజమహేంద్రవరం లో నిర్వహించే కార్యశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ పేర్కొనడం జరిగింది.
Prajavartha Online Telugu News