రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాజమహేంద్రవరం దేవీచౌక్ లో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిని కోరుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక దేవిచౌక్ లో ఉన్న అమ్మవారి దేవాలయం లో శ్రీ రాజ రాజేశ్వరీ దేవి అలంకరణలో ఉన్న ఆమ్మవారిని దర్శించుకుని కలెక్టర్ దంపతులు , కుటుంబం సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళలు పేరుతో వారి కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలందరికీ అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు. శక్తి మాతగా శక్తి స్వూపిణిగా అమ్మవారిని ఈరోజు కొలుచుకుంటూ పూజలు నిర్వహించామన్నారు.
Prajavartha Online Telugu News