నవంబర్ 12 న ములాయం సింగ్ యాదవ్ సంస్మరణ సభ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో నవంబర్ 12 న జరిగే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ములాయం సింగ్ యాదవ్ సంస్మరణ సభ కార్యక్రమం నెల్లూరు బీసీ నాయకులు మధు ఆధ్వర్యంలో జరగనుంది. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ జరుగుతున్న ఈ కార్యక్రమానికి బీసీ నాయకులు, అభిమానులు తదితరులు అందరు హాజరుకావాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా బీసీలు ఐక్యతకు, అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. బీసీ నాయకులు అందర్నీ ఒకచోటకు చేర్చి సమన్వయంతో ఒకే తాటిపై నడిచేలా, ములాయం సింగ్ యాదవ్ స్ఫూర్తితో ముందుకు నడిచేలా కార్యాచరణ రూపొందించుకునేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికారి ప్రతినిధి కొలను కొండ శివాజీ, మాచర్ల బీసీ సంక్షేమ సంఘం సమన్వయకర్త నాగరాజు యాదవ్, అల్లం రాజేష్, జమ్మన బోయిన గోపి, ప్రకాష్ దాడి జగన్, కనిశెట్టి లక్ష్మణ్, కొలగాని శ్రీనివాసరావు, పిల్ల జయ, కోరాడ శేషు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *