-ప్రపంచ చెఫ్ డే ని పురస్కరించుకొని విజేతలకు బహుమతులు
-ముఖ్య అతిధిగా ఎఫ్2 ఫేమ్ సినీ నటుడు ప్రదీప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ చెఫ్ డే ని పురస్కరించుకొని హైదరాబాద్ లక్డీ కా పూల్ లోని వాసవి ఏసీ ఆడిటోరియం లో నవంబర్ 6న వంటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎలివేట్స్ ఎలైట్ సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. మహిళలు తాము నిష్టాతులు అయిన వంటకాన్ని తయారు చేయవొచ్చని, ఆనాటి కార్యక్రమానికి విచ్చేసిన న్యాయ నిర్ణేతలు విజేతలని ప్రకటిస్తారని, విజేతలకు మొదటి ద్వితీయ తృతీయ బహుమతులు, కన్సోలేషన్ ప్రైజెస్ తో పాటు ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతిఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ప్రదానం చెయ్యడం జరుగుతుందని , షీరో హోమ్ ఫుడ్ సమన్వయం తో జరుగుతున్న ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి కలవారు 9573705300 నెంబర్ లో తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News