ప్రభుత్వం అత్యంత ప్రతష్టాత్మకంగా పేదలందరికీ ఇల్లు, గృహ నిర్మాణ పనులు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రతి వారం ఏడు వేల ఇళ్లను స్టేజ్ కన్వర్షన్ కింద చేపట్టవలసి ఉండగా ఆమేరకు మండల స్థాయి అధికారులు, ఇంజనీరింగ్ విభాగాల వారు ఆ మేరకు ఫలితాలు ప్రతిబింబించడలం లేదని కలెక్టర్ డా కె.. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి హోసింగ్ పై జిల్లా హౌసింగ్ అధికారి టి.తారా చంద్ తో కలిసి డివిజన్, మండల అధికారులతో ప్రత్యేక జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రతష్టాత్మకంగా పేదలందరికీ ఇల్లు, గృహ నిర్మాణ పనులను ప్రణాళిక మేరకు పూర్తి చేసి ఆయా గృహాలు ప్రారంభించాలని పేర్కొనడం జరిగిందన్నారు. ఆమేరకు ఇంజనీరింగ్ , సచివాలయం సాంకేతిక సిబ్బంది నిబద్దత తో కూడి సేవా భావంతో పనిచేయాలని అన్నారు. జిల్లా లో ఇప్పటి వరకూ సుమారు 12,500 ఇల్లు పూర్తి చేసిన, 90 రోజుల కార్యక్రమం కింద నూతనంగా స్థలాలు కేటాయింపులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. గతంలో కేటాయించిన వాటి గ్రౌండింగ్ తో పాటు నూతన కేటాయించిన వాటి పనులు సమాంతరంగా పూర్తి చెయ్యాలని ఆదేశించారు. ప్రధాన మంత్రి ఆవాసన యోజన పథకం కింద 6867 ఇళ్లకు గాను 5948 ఇళ్లకు మంజూరు చేశారని, వాటిని కూడా చేపట్టి పూర్తి చెయ్యాలని, ఎప్పటికప్పుడు ఆయా డేటా ఆన్లైన్ లో అప్లోడ్ చేసి బిల్లులు సమర్పిస్తే లబ్ధిదారులకు చెల్లింపులు త్వరితగతిన జరుగుతున్నాయి పేర్కొన్నారు. ఎన్ పి ఐ కింద చేపట్టిన వాటిలో బేస్మెంట్ స్థాయి దిగువున ఉన్న 26644 ఇళ్ల నిర్మాణాలు కోసం మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతి రోజు వెయ్య ఇళ్ల స్టేజ్ కన్వర్షన్ ద్వారా మెరుగైన ఫలితాలు కలుగుతాయని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *