జిల్లాలోరబీ సాగుకు నవంబరు 30 వ తేదీన ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నాం..

-తూర్పుగోదావరిజిల్లాలో రబీ కు 71,711ఎకరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల
-విత్తు నుంచి విక్రయం వరకు రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుంది.
-రైతుకు నష్టం రాకుండా ధాన్యం కొనుగోలులో ముఖ్యమంత్రి నూతన విధానాన్ని ప్రవేశ పెట్టారు..
-రాష్ట్ర మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి తానేటి వనిత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిలాల్లో రబీ సాగుకు ఈ నెల 30 వ తేదీన కాలువలకు సాగునీటిని విడుదల చేయడం జరుగుతుందని జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచారసంబందాలు, సినిమాఆటోగ్రఫీ శాఖ మంతి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.

బుధవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టరు డా.కే.మాధవీలత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, ఎంపీ మార్గాని భరత్ రామ్, ఎమ్ఎల్సీ చిక్కాల రామచంద్రరావు, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, జి.శ్రీనివాసనాయుడు, జిల్లా అగ్రి ఎడ్వజరీ బోర్డు చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రామాణికంగా భావిస్తూ రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో ఖరీఫ్ పంటకు జూన్ 1 వ తేదీన సాగునీటిని విడుదలచేయడం జరిగిందన్నారు. దీని వలన పంటలు ఎటువంటి తుపానులకు గురికాకుండా రక్షించుకోగలిగామన్నారు. ఏడాదిలో మూడు పంటలు పండించాలనే లక్ష్యం కాగా నేడు రెండవ పంట రబీకు ఈ నెల 30 వతేది ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా 71,711 ఎకరాల ఆయకట్టుకు కాలువలకు సాగునీటిని అందిస్తున్నామన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్బీకేల్లో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. రైతు సంక్షేమాన్ని కోరుతూ విత్తు నుంచి విక్రయం వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుకు భరోసాను కల్పిస్తుందన్నారు. రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలులో నష్టంపోకుండా గిట్టు బాటుధరను అందించేందుకు ముఖ్యమంత్రి నూతన విధానాన్ని ప్రవేశ పెట్టారన్నారు. జిల్లాలో మూడో పంటకు ముఖ్యమంత్రి ఆలోచన ఫలప్రదమవుతుదన్నారు. రబీ సాగునీటి అవసరాలకు సంబందించి అధికారులు చక్కని సమాచారాన్ని తెలిపారన్నారు. సాగునీటి సరఫరాలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటికి సంబందించి ప్రణాళికలు సిద్దం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేధికలు పంపి పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రజలకోసం రైతులు కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వం భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. కాటన్ మహాశయుడు నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజ్ కి ప్రపంచ వారసత్వ సంపదగా ఐసీఐడి అవార్డుతో గుర్తింపు రావడం మనకు ఎంతో గర్వకారణ మన్నారు. రబీకు కాలువల ద్వారా సాగు నీరు సక్రమంగా సరఫరా అయ్యేలా ముందుస్తు ప్రణాళికలు సిద్దం చేసుకొని తూడు తొలిగించాలని అందుకు అవసరమైన ఏజెన్సీలు ద్వారా త్వరితగతిన చేపట్టాలన్నారు. కాలువ శివారు ప్రాంతంలోని భూములకు సాగు నీటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు.

రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రైతులకు సకాలంలో సాగు నీరు, ప్రజలకు త్రాగు నీరు అందించే క్రమంలో, ప్రస్తుత రబీ సీజన్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం ఎంతో మేలు జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రైతు సంక్షేమం కోరుతూ అడుగడుగునా అండగా నిలిచి, రైతుల కోసం నిరంతరం ఆలోచన చేసూ వారి అండగా నిలిచి భరోసా కల్పిస్తున్నార్నారు. రైతులందరూ సంతోషంగా వ్యవసాయాన్ని పండుగలా చేయాలన్నాదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు. తాళ్లపూడి మండలం తిరుగుడు మెట్ట వద్ద నున్న కొవ్వాడ కాల్వ ముంపుకు గురైనప్పుడు పంటపోలాలు మునిగిపోడంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుందని, దీనికి శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు.

జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో సుమారు 71 వేల ఎకరాలకు రబీ సీజన్ లో పంట సాగు చేసుకునేందుకు సాగు నీరు విడుదల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి నవంబర్ 30 న నీటి విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసే నిర్ణయానికి రావడంలో తేదీ ని ప్రకటించడం కీలకం అన్నారు. సాగునీటిని పూర్తి స్థాయి లో రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఆయకట్టు పరిధిలో ఉన్న ప్రతి ఒక్క సెంటు భూమి కి సాగునీరు అందించే లక్ష్యంతో ఉన్నామన్నారు. రైతులకు మేలు చేసేందుకు తీసుకున్న నిర్ణయాల్లో రైతు భరోసా కేంద్రాలు ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయి లో రైతు సలహా మండలి ని ఏర్పాటు చేసుకుని, వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేయనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెల మొదటి శుక్రవారం నుంచి ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రబీ సీజన్ కి సాగునీరు అందించనున్న దృష్ట్యా అందుకు అవసరమైన నారుమడి, విత్తనాలు ఎరువులు సిద్దంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. రబీ లో సకాలంలో సాగు నీరు అందించి రైతులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలు అందజేసేందుకు సిద్దంగా ఉన్నట్లు మాధవీలత తెలియచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తున్నారు.

జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణగోపాలరావు మాట్లాడుతూ ప్రస్తుతం గోదావరి నదిలో రబీ అవసరాలకు సంబందించి 101 టీయంసీల నీరు ఉందని జనవరి, ఫిబ్రవరి మాసాల్లో నీటి ఎద్దడిని అదిగమించేందుకు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు.

ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ రైతు ఆర్థికాభివృద్ది కొరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అందించడంతో పాటు సకాలంలో సాగునీటిని అందించి రైతుకు అండగా నిలుస్తుందన్నారు.

రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ తొర్రిగడ్డ లిప్టు ఇరిగేషన్ కింద 1560 ఎకరాలు సాగు జరుగుతుందన్నారు. ఎత్తిపోతల పథకం అభివృద్దికి రూ. 22కోట్లు మంజూరైనా ఇప్పటి వరకు 30శాతం పనులు కూడా జరగలేదన్నారు. ఇరిగేషన్ అధికారులు దీని పై దృష్టి సారించి ఈసీజనల్లో పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు.

నిడదవోలు శాసనసభ్యులు జి.శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఖరీఫ్ లో సాగు నీరు సకాలంలో అందించడం వలన పంటలు బాగా పండాయన్నారు. రబీలో కూడా అదేవిధంగా ఎటివంటి నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో సాగునీటిని అందించన్నారు. నీటికి అడ్డుపడే గుర్రపుడెక్కను తొలగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పెండ్యాల పంపింగ్ స్కీమ్ పరిధిలో 7 వేల ఎకరాలు ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. ఖరీఫ్ లో రైతు చేతికి చక్కని పంట వచ్చిందని ఇదే విధంగా రబీలో కూడా ఎటువంటి సమస్యలు లేకుండా సాగునీటిని అందించాలన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

శాసన మండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ రెండవ పంట రబీకు సాగునీరు అందించే క్రమంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలువల్లో గుర్రపుడెక్క తొలగించే ప్రక్రియను ముందుగానే చేపట్టాలన్నారు.

జలవనరుల శాఖ ఎస్ ఈ కె. నరశింహ మూర్తి సభకు వివరిస్తూ రబీ సీజన్లో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ద్వారా జిల్లాలో 71,711 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నామన్నారు. గత ఏడాది ఖరీఫ్ లో జిల్లాలో మొత్తం 3,33,553 ఎకరాలకు గాను 3,07,456 ఎకరాలు సాగు నీటని అందించాన్నారు. రబీ పంటకు సాగునీటి కి సంబందించి వివిధ ప్రాజెక్టుల క్రింద ఎస్ ఈ నరశింహ మూర్తి ఫవర ఫాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐఏబి సమావేశంలో వివరించారు.

సమావేశంలో యంపి.మార్గని భరత్ రామ్, శాసనమమండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, జి. శ్రీనివాసనాయుడు, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ జిల్లా అగ్రిఎడ్వజరీ బోర్డు చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు , జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, జలవనరుల శాఖ ఎస్ ఈ కె. నరశింహ మూర్తి, పిఐపిఎల్ యంసీ సర్కిల్ ఎస్ ఈ బి. ఏసుపాదం, ఈఈ డీవీ రామగోపాల్, కె. విద్యాధరరావు, కొవ్వూరు ఏఎమ్సీ చైర్మన్ వల్లభశెట్టి శ్రీనివాస్, జేడీ వ్యవసాయశాఖ ఎస్. మాధవరావు, జలవనరుల శాఖ డీఈలు, ఏఈలు, ప్రజాప్రతనిధులు, రైతులు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *