జిల్లాను క్షయ నిర్మూలన జిల్లాగా తీర్చిదిద్దుదాం..

-టిబి బాధితులకు పౌష్టికాహారాన్ని అందించి టీబీ నుంచి విముక్తి చేద్దాం.
-గ్రాసిమ్ పరిశ్రమ “సి ఎస్ ఆర్” ద్వారా “ని-క్షయ్ మిత్ర” కింద 106 మందికి దత్తత తీసుకోవడం మంచి పరిణామం
-హోం మంత్రి తానేటి వనిత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో టీబీ కోసం చికిత్స పొందుతున్న వారికి బలవర్థకమైన ఆహారాన్ని అందించేందుకు “ని-క్షయ్ మిత్ర” గా ద్వారా దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.

సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు మాధవీలతతో కలసి “ని-క్షయ్ మిత్ర” కింద గ్రాసిమ్ సంస్థ టీబీ పెషంట్లకు 700 విలువ గల పౌష్టికాహార కిట్లను మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ క్షయవ్యాధిని సమూలంగా నిర్మూలన చేసే దిశలో వ్యాధిగ్రస్తులకు పోషక విలువలతో కూడి మంచి పౌష్టకాహారం అందించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయం అన్నారు. గ్రాసం ఇండస్ట్రీ సంస్థ, బలభద్రపురం వారు అనపర్తి నియోజకవర్గం పరిధిలో గల ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిదిలో గల 104 మంది పేషెంట్లను “ని-క్షయ్ మిత్ర” కింద దత్తత తీసుకొని వారికి ఆరు మాసాలకు సరిపడా పౌష్టికాహార కిట్లకు సంబందించి రూ. 4,44,912 రూపాయల విలువ గల చెక్కను అందజేయడం అభినందనీయమన్నారు. ప్రతి టీబీ పెషెంట్లకు క్రమం తప్పకుండా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా వైద్యులు మందులు అందిస్తున్నారని, వారిలో రోగ నిరోదక శక్తిని పెంచేందుకు పోషకాహరం అందించేందుకు దాతలు స్వచ్చందంగా ముందుకు అభినందనీయం అన్నారు. మరింత మంది ముందుకు వచ్చి జిల్లాను టిబి రహిత జిల్లాగా చేద్దాం అని పిలుపు నిచ్చారు.

జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత మాట్లాడుతూ సమాజంలో క్షయ వ్యాధి గ్రస్తులకు “ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అబియాన్” నిక్షయ్ మిత్ర పథకం ద్వారా పౌష్టికాహారం సహాయం అందించటం కొరకు భారత ప్రభుత్వం ఆరోగ్య శాఖ ద్వారా 2022 సెప్టెంబరు 9 న ప్రారంభించిందన్నారు. 2025 నాటికి భారత దేశాన్ని టీబీ రహిత దేశంగా ఉంచాలన్నదే దీని ముఖ్యోద్దేశ్యం అన్నారు. క్షయ రోగులకు సహాయం అందించటకు ఇష్టపడిన వారు నిక్షయ్ పోర్టల్ వెబ్ సైట్ నందు నమోదు చేసుకోవాన్నారు. కనీసం ఆరు వారాలు పాటు ఒక టీబీ పెషెంట్ ను దత్తత తీసుకొని నెలకు రూ.700 విలువ గల పోషకాహాన్ని అందించడం ద్వారా వారినిలోని రోగ నిరోదక శక్తి పరిగి తద్వారా టీబీ వ్యాధి తగ్గుతుందన్నారు.

కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.వెంకటేశ్వరరావు, జిల్లా ఎయిడ్స్, లెప్పర్సీ, టీబీ కంట్రోల్ అధికారి డా. ఎన్. వసుందర, గ్రాసం ఇండస్ట్రీస్ ప్రతినిధులు ఆర్ జి. కృష్ణ, మురళీ కృష్ణ, జిల్లా అధికారు తదితరు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *