Breaking News

జిల్లాలో రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ద్వారా భరోసా 5,488మంది రైతులకు రు.5.35 కోట్ల జమ..

-రైతే రాజు గా ఉంటే రాష్ట్రం సుభిక్షం గా ఉంటుంది అని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి…
-ఆ దిశలోనే ఆయన అడుగులు వేయడం జరిగింది
-వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు వరుసగా మూడో ఏడాది.
-విత్తునుంచి విక్రయం వరకు ప్రభుత్వం భాద్యత తీసుకుంది.
-జిల్లాలో వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలుగా జిల్లాలో 41,595 మంది రైతులకు రు.8.44 కోట్లు జమ.
-రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత
-జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు సంక్షేమమే లక్ష్యం గా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతన్నకు సున్నా వడ్డీ రాయితి , ఆర్థిక భరోసాని కల్పిస్తూ రైతు భరోసా, అర్భికే లను ఏర్పాటు చెయ్యడం జరిగిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి డా. తానేటి వనిత అన్నారు.

సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ వీసీ సమావేశ మందిరంలో రైతన్నకు సున్నా వడ్డీ రాయితీ, ఇన్పుట్ సబ్సిడీ, పంటరుణాలపై వడ్డీ రాయితీ జిల్లా స్థాయి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మాధవీలత అధ్యక్షతన వహించగా, రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవన పంటలకు సంబంధించి రాష్ట్రంలోని రైతన్నలకు నేడు అందిస్తున్న ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్ముతో పాటు, గతంలో వివిధ సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు పొందని వారి అకౌంట్లలో జమ చేసే సొమ్ముతో కలిపి మొత్తం రూ. 200 కోట్లను రైతుల బ్యాంకు ఖాతా ల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం ద్వారా జమ చెయ్యడం జరిగిందన్నారు. మన ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు. గడప గడపకు వెళ్ళినప్పుడు, మన ప్రభుత్వం వలన కలుగుతున్న ప్రయోజనం రైతులు చెప్పడం జరుగుతోందన్నారు. రైతులకు పూర్తి స్థాయి లో మద్దతు ధర అందించే సామర్థ్యం కలిగి ఉండేలా రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగానే నష్టపరిహారం చెల్లిస్తామన్న మాట మరోసారి నిలబెట్టుకుంటూ రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ. 2022 జులై – అక్టోబర్‌ మధ్య (ఖరీఫ్‌లో) కురిసిన అధిక వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన 5488 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతన్నలకు రూ. 5.35 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఖరీఫ్‌ 2022 ముగియక ముందే నేడు నేరుగా వారి ఖాతాలకు జమచేశామని మంత్రి తానేటి వనిత అన్నారు. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతన్నలకు సత్వర ఉపశమనం కల్పిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్‌ ముగిసేలోగానే నష్టపరిహారం పంపిణీ చేస్తూ, దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. పంటలు వేసే ప్రతిసారి రైతన్న పెట్టుబడి ఖర్చుల కోసం అధిక వడ్డీల వలలో చిక్కకూడదన్న ఉద్దేశంతో సన్న, చిన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకు పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు వరుసగా మూడో ఏడాది కూడా అందించడం జరుగుతొందన్నారు. అన్నదాతలు అధిక వడ్డీలతో అప్పుల ఊబిలో కూరుకు పోకుండా వారికి అండగా నిలుస్తూ, ఈ-క్రాప్‌ డేటా ఆధారంగా లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు తిరిగి చెల్లించిన రైతన్నలకు పూర్తి వడ్డీ రాయితీని క్రమం తప్పకుండా అందిస్తున్నది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అన్నారు. గతంలో అశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా, రైతన్నలు మధ్యదళారులు దోపిడీకి గురవ్వడం, క్షేత్రస్ధాయి ఉద్యోగుల చుట్టూ ఏళ్ళ తరబడి తిరిగినా పరిహారం అందుతుందో లేదో తెలియని దుస్ధితి ఉండేదని హోం మంత్రి తానేటీ వనిత తెలిపారు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఎగ్గొట్టి, మరికొన్ని సందర్భాలలో రెండు మూడు సీజన్ల తర్వాతే సాయం అందించేవారని, అదీ కూడా అరకొరగానే అందించే వారని పేర్కొన్నారు. రైతే రాజైతే రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉంటుందన్న ఆశయంతో సీయం ఆర్భీకేలు, రైతు బరోసా పథకం, ఇన్ పుట్ సబ్సిడి, పంటనష్ట పరిహారం గా ఆర్థిక చేయూత నందిస్తున్నారు. విత్తునుంచి విక్రయం వరకు ప్రభుత్వం భాద్యత తీసుకుంటుందన్నారు. గతంలో వ్యవసాయాన్ని దండగ అని చెప్పి గత పాలకులు రైతుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వ్యవహరించేవారన్నారు. నేడు ముఖ్యమంత్రి జగనన్న రైతుల పక్షాన నిలబడి వ్యవసాన్ని పండుగలా చేసేందుకు రైతులకు ధైర్యాన్ని అందిస్తున్నారు.

జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవన పంటలకు సంబంధించి వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలుగా 41,595 మంది రైతులకు రు.8.44 కోట్లు, పంట నష్టం పై పెట్టుబడి రాయితీగా 5,488 మంది రైతులకు రు.5.35 కోట్ల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు అమరావతి నుంచి బటన్ నొక్కి రైతులు ఖాతాల్లో నేరుగా జమ చేశారన్నారు. జిల్లాకు సంబంధించిన రబీ 2020 – 21, ఖరీఫ్‌ 2021లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 27,183 మంది రైతన్నలకు రూ. 501.30 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును వారి ఖాతాల్లో నేడు నేరుగా జమ చేయడం జరిగిందని ఆమె అన్నారు.

నియోజకవర్గం వారీగా సున్నా వడ్డీ..
అనపర్తి నియోజకవర్గం.. 4237 మంది రైతులకు రు.67.24 లక్షలు..
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం.. 632 మంది రైతులకు రు.11.69 లక్షలు..
రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గం.. 2 మంది రైతులకు రు.3 వేలు ..
రాజానగరం నియోజకవర్గం.. 3823 మంది రైతులకు రు.69.26 లక్షలు..
జగ్గంపేట నియోజకవర్గం.. గోకవరం మండలం 377 మంది రైతులకు రు.7.33 లక్షలు..
గోపాలపురం నియోజకవర్గం.. 3697 మంది రైతులకు రు.92.37లక్షలు..
కొవ్వూరు నియోజకవర్గం.. 5769 మంది రైతులకు రు.115.36 లక్షలు..
నిడదవోలు నియోజకవర్గం.. 8749 మంది రైతులకు రు.138.02 లక్షలు..
మొత్తం.27,183 మంది రైతులకు రు.501.30 కోట్లు జమ చేయడం జరిగింది

అదేవిదంగా పంటనష్టం పెట్టుబడి రాయితీగా..
2021.. ఖరీఫ్ లో జిల్లాలోని 2455 మంది రైతులకు రు.2.47 కోట్లు.
2022.. ఖరీఫ్ లో జిల్లా లోని 583 మంది రైతులకు రు.0.75 కోట్లు రైతు ఖాతాలో ఏం చేయటం జరిగింది.

జిల్లాలో మొత్తం వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, పంట నష్టం పై పెట్టుబడి రాయితీగా జిల్లాలో మొత్తం 47,083 మంది రైతుల ఖాతాలకు రు.13.79 కోట్లు జమ చేయడం జరిగింది.

రైతుల అభిప్రాయాలు…
రాజానగరం మండలం సంపత్ నగరం గ్రామానికి చెందిన పి. వెంకటేశ్వరరావు తన అభిప్రాయాన్ని తెలుపుతూ తనకు 4 ఎకరాలు పంట భూమి ఉందని గతంలో వ్యవసాయానికి పెట్టుబడి పెట్టేందుకు అధిక వడ్డీలకు తెచ్చావరమని పంట చేతికి రాగానే వడ్డీలకే ఎక్కువ మొత్తంలో కట్టేవారమన్నారు. నేడు ఆ పరిస్థితి లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులు భరోసా పథకం, సున్నావడ్డి అందిస్తు ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
కోరుగొండ మండలం గాధరాడ గ్రామానికి చెందిన చిక్కిరెడ్డి దుర్గా భాస్కర్ తమ అనుభవాలను తెలుపుతూ తాను 4.5 ఎకరాలు కౌలుకు సేద్యం చేస్తున్నానని, అప్పులు భాదలు లేకుండా ప్రభుత్వం సున్నా వడ్డి అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆర్పీకేలు ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందిస్తున్నారని తెలిపారు.

రాజానగరం మండలం సంపత్ నగరం రైతు కూరపాటి గెరటారావు తన అభిప్రాయాన్ని తెలుపుతూ తన కు ఒక ఎకరం పొలం ఉందని ప్రభుత్వం రైతు భరోసాగా రూ. 13500/-లు, అందిచండమే కాకుండా బ్యాంకు రుణంగా తీసున్న వడ్డిని ప్రభుత్వమే చెల్లించడం వలన వడ్డీల బెడద లేకుండా సంతోషంగా ఉన్నామని, పంట చేతికి వచ్చిన సమయంలో ఆర్బీకేలు ద్వారా ధాన్యానికి గిట్టుబాటు ధరను అందించి ఆదుకుంటున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు.

కార్యక్రమంలో డీసీసీబి చైర్మన్ ఆకుల వీర్రాజు,రుడా చైర్ పర్సన్ షర్మిళా రెడ్డి, గోపాలపురం ఎఎమ్ సీ చైర్మన్ జి. జనార్థనరావు, జిల్లా వ్వవసాయశాఖాధికారి ఎస్. మాధవరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి వి.రాధాకృష్ణ, జిల్లా అగ్రి ఎడ్వజరీ బోర్టు మెంబరు కంతేటి వినయ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *