జిల్లాలో ద్వై వార్షిక విడుదల చేయనున్న రూ.12.92 కోట్లతో 9,493 మందికి లబ్ది

-సిఎం చేతుల మీదుగా డిసెంబర్ 27 మంగళవారం లబ్దిదారుల ఖాతాకు జమ
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మిగిలి ఉన్న అర్హులైన వారిని గుర్తించి ద్వి వార్షిక ప్రణాళిక ప్రకారం వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింప చేసే దిశలో 9, 493 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగనుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ద్వి వార్షిక కింద జిల్లాలో గుర్తించిన 9,943 మందికి రు.12.92 కోట్లు మేర ఆర్థిక ప్రయోజనాన్ని మంజూరు చేసి, డిసెంబర్ 27 న జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ ద్వారా నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. పథకాలు వారీగా : జగనన్న అమ్మఒడి పథకం కింద 1994 మంది లబ్ధిదారులకు రు. 2.59 కోట్లు,వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద 1255 మంది లబ్ధిదారులకు రు. 1.88 కోట్లు, వైయస్సార్ నేతన్న నేస్తం పథకం కింద 22 మంది లబ్ధిదారులకు రు.5 లక్షలు, వైయస్సార్ వాహన మిత్ర పథకం కింద 343 మంది లబ్ధిదారులకు రు.34 లక్షలు, వైఎస్ఆర్ చేయూత పథకం కింద 1044 మంది లబ్ధిదారులకు రు. 1.96 కోట్లు, ఈ బీసీ నేస్తం పథకం కింద 62 మంది లబ్ధిదారులకు రు. 9 లక్షలు, జగనన్న చేదోడు పథకం కింద 43 మంది లబ్ధిదారులకు రు. 4 లక్షల ముప్పై వేలు , వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 15 మంది లబ్ధిదారులకు రు. 2 లక్షలు, జగనన్న వసతి దీవెన పథకం కింద 617 మంది లబ్ధిదారులకు రు.52 లక్షలు, జగనన్న విద్యా దీవెన పథకం కింద 4098 మంది లబ్ధిదారులకు రు. 5.43 కోట్లు మేర జిల్లాలోని అర్హులైన వారికి ఈ దఫా విడుదల చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను అర్హులకు చేరాలని, ఆ దిశలో సచివాలయ పరిధిలో ను సిబ్బంది, వాలంటీర్ వ్యవస్థలు మరింత నిబద్దత తో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *