Breaking News

సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దుప్పట్లు పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజికవేత్త, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు, శీ నక్కా రాములు కోటేశ్వరమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు నక్కా వీరభద్రరావు, రాజ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో సోమవారం ఐనాక్స్‌ సెంటర్‌నందు అరుణ పతాక అవిష్కరణ మరియు కేక్‌ కటింగ్‌, పేదవారికి దుప్పట్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ 36వ డివిజన్‌ శాఖ నాయకులు నక్కా వీరభద్రరావు మాట్లాడుతూ నాడు బ్రిటిష్‌ పాలకుల నిర్బంధకాండకు, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 1925, డిసెంబరు 26న కాన్పూర్‌ (ఉత్తరప్రదేశ్‌) గడ్డపై భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. గడిచిన 97 ఏళ్ల కాలంలో ఎన్నో వీరోచిత పోరాటాలు, మహోన్నత త్యాగాలు, మహత్తర విజయాలకు సీపీఐ ప్రతీకగా నిలిచింది. ఈ విప్లవాత్మక, సాహసోపేత ప్రస్థానం ఇప్పుడు 98వ సంవత్సరంలోకి అడుగుపెడుతోందన్నారు. దీనిని పురస్కరించుకుని సుమారు 200 మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. మా ట్రస్ట్‌ తరఫున కూడా పేదలకు దుస్తులు, దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ, విద్యార్ధులకు పుస్తకాలు, పెన్నులు, కొందరికి స్కాలర్‌షిప్‌లు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కరోనా సమయంలో కూడా కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. భవిష్యత్‌లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. శ్రామికులకు, నిరుపేదలకు అండగా తమ పార్టీ ఎప్పుడూ వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, సభ్యులు, అభిమానులు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *