రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి పర్యటన అత్యంత విజయవంతం కావడం అధికారులు మధ్య సమన్వయం కీలకం అని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. శనివారం ఉదయం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో అధికారులతో సి ఎం పర్యటన పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జనవరి 3 వ తేదీ మంగళవారం నాడు తూర్పు గోదావరి జిల్లా లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఖరారు అవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సామాజిక భద్రత పెన్షన్ పెంపు పథకం తూర్పు గోదావరి జిల్లా వేదిక కావటం ఈ నేపథ్యంలో విధులను నిర్వర్తించడం లో అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం సాధించడం ముఖ్యం అన్నారు. గ్యాలరీ విధులను నిర్వర్తించడం కోసం ఆయా గ్యాలరీలకు సంబందించి వాటర్ ప్యాకెట్స్, అల్పాహారం, అవసరమైతే ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సిద్దం చేసుకోవాలన్నారు. బహిరంగ సభకు వొచ్చే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కార్యాచరణ ప్రణాళిక ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఏ ఏ రూట్ల లో వచ్చే బస్సులకు సంబంధించి పార్కింగ్ పై బస్సు ఇంఛార్జి లకు ముందస్తుగా తెలియ చేయాలన్నారు. ఆయా బస్సులకు సరిపడే ఆహార పదార్థాలను, వాటర్ బాటిల్స్ ముందస్తుగా అందచేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన అధ్యాంతం విజయవంతం కావడం లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కీలకం అన్నారు. స్టేజ్ ఏర్పాట్లు, వేదికపై ఆహ్వానితుల ప్రోటోకాల్, స్టాల్స్ వద్ద లబ్దిదారుల కు సంబందించి సూచనలు చేశారు.
జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, ఇప్పటికే మూడోవ తారీఖు కి సంబంధించిన రూట్ మ్యాప్ వివరాలు ఆయా అధికారులకు తెలియ చెయ్యడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రూట్ మ్యాప్ మేరకు పని చెయ్యడం, సభకు వచ్చిన వారు సురక్షితం తిరిగి గమ్య స్థానాలకు చేరే వరకు బస్సు ఇంఛార్జి లదే భాధ్యత అన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జీ. నరసింహులు, ఆర్డీవోలు ఎస్. మల్లిబాబు, ఏ. చైత్ర వర్షిణి, జిల్లా అధికారులు జీ ఎస్ రామ గోపాల్, పి. జగదంబ, ఎస్కే షబ్నం, కె. విజయకుమారి, బి. తారా చంద్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News