విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉండేలా పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని ఆవినాష్ కొనియాడారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 17వ డివిజన్ 78వ సచివాలయం పరిధిలో రాణిగారితోట సుధాకర్ హాస్పిటల్ రోడ్ నుండి మొదలై MS.రోడ్, ముని అప్పలనాయుడు రోడ్ ప్రాంతాల్లో నాయకులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తో కలిసి ఇంటింటికి వెళ్లిన ఆవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ క్యాలెండర్ ను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో దేశవ్యాప్తంగా మిగతా ముఖ్యమంత్రి లకు జగన్ ఆదర్శంగా నిలిచారని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా సంక్షేమ పాలన అందిస్తున్నారని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఈ డివిజన్ లో వైసీపీ కార్పొరేటర్ గెలిచారు అని అసలు అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. కానీ నేడు గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత మా ప్రభుత్వం దే అని అన్నారు. ప్రచార పిచ్చితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వనికి ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇప్పుడు ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చాలని చూస్తున్నారు అని విమర్శించారు. కార్యకర్తలను రెచ్చగొడుతూ పోలీసుల మీద దాడులకు ఉసిగొల్పడం దారుణంమని తెలిపారు. మీరెన్ని కుట్రలు చేసిన వైసీపీ విజయాన్ని ఆపలేరు అని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి,నాగవంశ కార్పొరేషన్ డైరక్టర్ ఎర్నేటి సుజాత వైసిపి నాయకులు కాశీ,తాజుద్దీన్, వెంకటేశ్వరావు, తిరుపతిరెడ్డి, సుధాకర్,దామోదర్,గీతా కుమారి,జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News