ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని  ఆమేరకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ  చైర్మన్ ఏ. మల్లిఖార్జున  రెడ్డి,ఎండి సిహెచ్.ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆవరణలో  సుమారు 46 లక్షలతో నిర్మించిన డిస్పెన్సరిని రాష్ట్ర రోడ్డు రవాణ శాఖ చైర్మన్ మల్లిఖార్జున రెడ్డి, ఎండి సిహెచ్. ద్వారాకా తిరుమలరావు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబో, పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ లతో కలసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఈ ప్రాంతంలో డిస్పేన్షరీని ఏర్పాటు  చేయడం ద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైద్యరంగానికి పెద్ద పీట  వేస్తున్నారని ఆర్టీ సీ ఉద్యోగుల కోసం డిస్పెన్షరీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందుకు కృషి చేసిన యంపి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జున రెడ్డి, యండి ద్వారకాతిరుమలరావులను ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు.

ఆర్టీసీ చైర్మన్ ఏ. మల్లిఖార్జున రెడ్డి మాట్లాడుతూ  డా. వైఎస్. రాజశేఖరరెడ్డి హాయాం నుంచి ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని ఆసమయంలో ఆర్టీసీ ఎటువంటి సంక్షోభం లేకుండా ఉండేందుకు రూ. 500 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. తదుపరి వచ్చిన పాలకులు ఆర్టీసీని నిర్లక్ష్యం చేసారన్నారు. నేడు  సీయంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులగు గుర్తింపు నిచ్చి ఉద్యోగ భద్రతను కల్పించారన్నారు. ఉద్యోగులు ఆర్టీసీ అభివృద్దికి తద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్దిలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. మీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
ఆర్టీసీ ఎండి సిహెచ్. ద్వారకా తిరుమల రావు మట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు నివ్వడం జరిగిందన్నారు.  వీరు  సంస్థ అభివృద్ది కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణీకుల సంక్షేమం చూస్తూ ఆర్టీసీ అభివృద్దికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలన్నారు. ఈ సంక్రాంతి సీజన్ లో ఇతర ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలకు ఆర్టీసీ బస్ ల్లో ప్రయాణం చేస్తూ వారి గ్రామాలకు వస్తారని, ప్రయాణీకులతో ఆక్యుపన్షి పెంచాలన్నారు.  గతంలో పండగ సీజన్ లో 50 శాతం అధిక ధరలు నిర్ణయించి ఆమేరకు  టికెట్లు ఛార్జీలు ఉండేవని ఈ ధఫా ఎటువంటు ధరలు పెంచలేదన్నారు.  రిటైర్ అయ్యి హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పరుచున్న ఆర్టీ ఉద్యోగులకు ప్రత్యేక డిస్పేన్సరీ  అందుబాటులోనికి  తెచ్చామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల ప్రతినెల 100 రూపాయల విరాళాలతో రూ. 30 కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకొని  విజయవాడ లో ఆధునిక వసతులతో  కూడిన ఆసుపత్రిని నిర్మించుకున్నామన్నారు. ఇందుకు ఆర్టీసీ ఉద్యోగులను అభినందిస్తున్నామన్నారు.  అదే తరహాలో ఆర్టీసీ ప్రాంతీయ కేంద్రాల్లో కూడా డిప్షన్సరీల ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయన పిలుపు నిచ్చారు.

రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరణ చేస్తున్న ఈరోజుల్లో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇచ్చి వారి కుటుంబలకు భరోసాను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్  రెడ్డి కల్పించాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.

రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి మాట్లాడుతూ  ఆర్టీసీ ఉద్యోగుల జీతాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇచ్చిన ఘనత జగనన్నదని పేర్కొన్నారు.  నూతనంగా ఆర్టీసీ బస్సులను అందించడం ద్వారా  ఆర్టీసీ ప్రయాణం పట్ల సానుకూల ధృక్పధాన్ని ప్రజల్లోకి తీసుకురావడం జరిగిందన్నారు.

కార్యక్రమంలో డీసీసీబి చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా  చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి, ఎపీ ఖాదీబోర్డు చైర్మన్ పిల్లి నిర్మల, ఆర్టీసీ డిపో మేనేజరు ఎస్.కే.షబ్నం,ఆర్ యం.శర్మిలా అశోక్ పలువులు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు, డైవర్లు, కండక్టర్లు, పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *