Breaking News

వార్డు అడ్మిన్ సెక్రటరీ, శానిటేషన్ సెక్రటరీలకు పూర్తి పాలనా బాధ్యతలు కల్పించాలి… : ఎం.డి.జాని పాషా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వార్డు అడ్మిన్ సెక్రటరీలకు పూర్తి పాలనా బాధ్యతలు కల్పించాలని, వార్డు శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు ఇతర సచివాలయ ఉద్యోగుల లా టైమింగ్స్ కేటాయించాలని పురపాలక మరియు వార్డు సచివాలయాల శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్,  రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా వినతి పత్రం అందచేశారు. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా ఆధ్వర్యంలో పురపాలక మరియు వార్డు సచివాలయాల శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను కలిసి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు పూర్తి స్థాయి పాలనా బాధ్యతలు కల్పించాలని,మరియు వార్డు శానిటేషన్ &ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు ఇతర సచివాలయ ఉద్యోగుల మాదిరిగా ఆఫీస్ టైమింగ్స్ కల్పించాలని, యూజర్ చార్జెస్ నుండి విముక్తి కల్పించాలని వినతి పత్రం అందించడం జరిగింది.

మరో వినతిలో సచివాలయ ఉద్యోగులకు, ప్రతి ఏడాది క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, యూనిఫామ్ తొలగించాలని,నోష్నల్ ఇంక్రిమెంట్లు కల్పించాలని, జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ కల్పించాలని, సచివాలయ ఉద్యోగులకు బదిలీలు కల్పించాలని, 2020వ సంవత్సరం రెండో విడుతలో ఉద్యోగాలు పొందిన వారికి ప్రోబేషన్ డిక్లేర్ చేయాలని, సచివాలయ ఉద్యోగులందరికీ ప్రమోషన్ ఛానల్స్ కల్పించాలని కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు స్టాలిన్ చక్రవర్తి, యస్.కె.సుభాని, పి.మనోహర్, కె.రాజ్ కిరణ్, మెహబూబ్, మహిళా నాయకులు బి.శ్వేత, అర్చన, వి.సుజాత తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *