అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పంచాయతీలు కేటాయించాలని ఉపముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి.ముత్యాల నాయుడుకు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్, రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా వినతి పత్రం అందచేశారు. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రి పంచాయతీ రాజ్ మరియు గ్రామ సచివాలయాల శాఖ మంత్రి బూడి.ముత్యల నాయుడును కలిసి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పంచాయతీల పూర్తి స్థాయి పాలనా బాధ్యతలు మరియు అధికారాలు కల్పించాలని వినతి పత్రం అందించడం జరిగింది. మరో వినతిలో సచివాలయ ఉద్యోగులకు, ప్రతి ఏడాది క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని,యూనిఫామ్ తొలగించాలని,నోష్నల్ ఇంక్రిమెంట్లు కల్పించాలని, జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ కల్పించాలని, సచివాలయ ఉద్యోగులకు బదిలీలు కల్పించాలని, 2020వ సంవత్సరం రెండో విడుతలో ఉద్యోగాలు పొందిన వారికి ప్రోబేషన్ డిక్లేర్ చేయాలని, సచివాలయ ఉద్యోగులందరికీ ప్రమోషన్ ఛానల్స్ కల్పించాలని కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు స్టాలిన్ చక్రవర్తి, యస్.కె.సుభాని, పి.మనోహర్, కె.రాజ్ కిరణ్, మెహబూబ్, మహిళా నాయకులు బి.శ్వేత, అర్చన, వి.సుజాత తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News