విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవాని ద్వీపంలో సంక్రాంతి సందడి. సాంప్రదాయ గ్రామీణ వాతావరణంలో సాంస్కృతికకార్యక్రమాలు, వైజ్ఞానిక ప్రదర్శనలతో అలరిస్తున్న భవాని ఐలాండ్.- 1980ల నాటి గ్రామీణ వాతావరణ అనుభూతిని నగర ప్రజలకు అందించడానికి మరియు ఆధునిక సంస్కృతికి అలవాటు పడిన పిల్లలకు సంప్రదాయ రుచులు మరియు వాటి ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ భవానీ ద్వీపంలో సంక్రాంతి సందడిని ప్రారంభించింది. సంక్రాంతి పండుగ తో జరిగే వాతావరణ మార్పుల గురించి సౌర చక్రాల ఆధారంగా ఖగోళ ప్రాముఖ్యత గురించి పిల్లలకు అవగాహన కల్పించడానికి సైన్స్ ఫెయిర్, మరియు కళాత్మక ప్రదర్శనలు కూడా నిర్వహిస్తోంది. ద్వీపాన్ని సందర్శించడానికి వచ్చే ప్రజలకు సన్నాయి మేళం, హరిదాసులు , పిట్టల దొర, గంగిరెద్దు బసవన్నలు స్వాగతం పలుకుతారు. వీటితోపాటు భోగి మంటలు, బొమ్మల కొలువు,సోది, చిలక జోస్యం , జానపద నృత్యాలు , బుర్ర కథ, హరికధ కళాకృతులు మన సంస్కృతిని ప్రతిబింబించేలాఏర్పాటు చేయబడ్డాయి. టిక్కెట్ ధర రూ. 300/- (పెద్దలకు) & రూ.150/- (6 నుండి 12 ) ఈ ధరలో బోటింగ్, భవాని ఐలాండ్ ప్రవేశం, పోటీలలో ఉచిత ప్రవేశం, సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ స్టాల్స్, అద్దాల మహల్, మేజ్ గార్డెన్ & రోబోటిక్ పార్క్‌కి ఉచిత ప్రవేశం. రేపు అనగా 14 -01-202న సినీ హీరోయిన్ ఆమని, ఎల్లుండి 15 -1- 22న హీరోయిన్ ఇంద్రజ భవాని ఐలాండ్ కు విచ్చేసి సందడి చేయనున్నారు.
Prajavartha Online Telugu News