హెల్మెట్ ధరించి ర్యాలీ లో పాల్గొన్న జక్కంపూడి రాజా

-ర్యాలీ ఆర్టీవో కార్యాలయం – సెంట్రల్ జైల్ – నందన్ గని రాజు సెంటర్ – తాడి తోట – ఆర్టిసి బస్ స్టాండ్ – మోరంపూడి జంక్షన్ – సర్వీస్ రోడ్ మీదుగా – లాలాచెరువు జంక్షన్ – ఆర్టీవో కార్యాలయం వరకు
-రహదారి భద్రతా స్లోగన్స్ తో నిర్వహించిన ర్యాలీ
-రహదారి భద్రత మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించండి
-అతివేగం ప్రమాదకరం.. ట్రాఫిక్ నియమాలు పాటించాలి.
-ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రహదారుల భద్రత పై కనీస అవగాహన అవసరమని వాహనాలు నడిపే వ్యక్తులు ఖచ్చితంగా రవాణా శాఖ జారీ చేసే మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని, ప్రమాదాల నివారణకు తమ వంతుగా సామాజిక బాధ్యత తో వ్యవహరించాలని రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా పిలుపు నిచ్చారు.

శనివారం ఉదయం స్థానిక ఆర్టీవో కార్యాలయం నుంచి 34 వ జాతీయ భద్రతా వారోత్సావాల సందర్భంగా 3వ రోజు నిర్వహించిన బైక్ ర్యాలీ ని శాసన సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, సురక్షితమైన ప్రయాణం కోసం రహదారి భద్రతా చర్యలు తప్పని సరిగా తీసుకోవాలన్నారు. ప్రతి రోజు వివిధ పనులపై (బైక్) వాహనాల పై తిరిగే సమయాల్లో హల్మెట్ ధరించ పోవడం, అతి వేగంగా ప్రయాణించడం  జరుగుతుంది, కొద్ది పాటి నిర్లక్ష్యం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని, వందల్లో మరణాలు సంభవిస్తున్నాయన్నారు. అందువల్ల  ఆయా కుటుంబాలకు పెద్ద అయిన వ్యక్తి, ఆ వ్యక్తి పై ఆధారపడిన కుటుంబాలకు తీరని శోకం ఉంటుందన్నారు.  సురక్షితమైన ప్రయాణం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకుని వొచ్చే ఉద్దేశ్యం తో ఇటువంటి కార్యక్రమాలను చేపడుతున్నామని, ఇందుకు అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు జక్కంపూడి రాజా అన్నారు. హెల్మెట్ పెట్టుకోవడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం, అతివేగం ప్రమాదకరం పై చేపడుతున్న అవగాహన కార్యక్రమం మన కోసం అనే స్పృహ ప్రతి ఒక్కరిలో ఉండాలని ఆయన పేర్కొన్నారు . ప్రతి ఒక్కరూ సురక్షితమైన ప్రయాణం చెయ్యాలని కోరుకోవడం జరుగుతోందన్నారు.

జిల్లా రవాణా అధికారి కేవి కృష్ణా రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 34 వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం బైక్ ర్యాలీ ని నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా హెల్మెట్స్ లని ధరించి స్థానిక ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు, రహదారిపై రవాణా భద్రతా నియమాలు పాటించడం పై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. తద్వారా ప్రమాదాలను తగ్గించి, మరణాల సంఖ్య తగ్గించడం లక్ష్యం అన్నారు. జిల్లా కలెక్టర్ కె. మాధవీలత ఆదేశాల మేరకు, జిల్లాలో ప్రమాదాలను నివారించేందుకు, ఈ ప్రక్రియను పోలీసులతో సమన్వయం చేసుకుంటూ కొనసాగించడం ద్వారా రహదారి పై ప్రమాదాలను తగ్గించడం కోసం కృషి చెయ్యడం జరుగుతుందని కృష్ణా రవు అన్నారు.

ర్యాలీ ఆర్టీవో కార్యాలయం నుంచి ప్రారంభం అయిన ర్యాలీ – సెంట్రల్ జైల్ – నందన్ గని రాజు సెంటర్ – తాడి తోట – ఆర్టిసి బస్ స్టాండ్ – మోరంపూడి జంక్షన్ –  సర్వీస్ రోడ్ మీదుగా – లాలాచెరువు జంక్షన్ మీదుగా తిరిగి ఆర్టీవో కార్యాలయం వరకు జరిగింది.

ఈ కార్యక్రమంలో  డి టి సి  కె.ఎస్ యమ్.వి కృష్ణారావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లు రంగనాయకులు, .సంపత్, రామ్ నారాయణ్ , సహాయ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు శ్రీదేవి, రాదిక, సుమా, సబితా, పలువురు కాలేజీ విద్యార్థులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *