రాజమహేంద్రవరం లో ఘనంగా 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 18 ఏళ్ళు నిండిన యువత ఓటరుగా నమోదై తమ ఓటు హక్కును కలిగి ఉండాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో 13 వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లా స్థాయి ఓటరు దినోత్సవ కార్యక్రమ వేడకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టరు ముఖ్యఅతిధిగా పాల్గొనగా, జిల్లా జాయింట్ కలెక్టరు తేజ్ భరత్, మున్సిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్ లు హాజరయ్యారు. జిల్లాలోని ఓటరు నమోదు అధికారులు,సిబ్బంది, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ముందుగా తమఓటు నమోదు చేసుకోవాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనం దేశంలోనే ఉందన్నారు. విజయవంతమైన ప్రజాస్వామ్యానికి పునాది పటిష్టమైన ఎన్నికల ప్రక్రియ అని, అందుకు కారణం ఓటు హక్కు కలిగి ఉండడమే అన్నారు. ఇప్పుడు సంవత్సరానికి నాలుగు సార్లు 18 ఏళ్లు నిండిన అర్హులైన యువత ఓటు నమోదును ఎన్నికల కమిషన్ సులభతరం చేసిందన్నారు. ప్రశ్నించడం కన్నా ముందు మన ఓటరు నమోదు కావాలన్నారు. ఎన్నికల సమయంలో మనం ఓటు వేసి మంచి వారిని ఎన్నుకున్న తరువాత ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి వస్తుందన్నారు. ఓటరు నమోదు ప్రక్రియ నిరంతంగా ఉంటుందని, ఈ విషయం పై ప్రతి ఒక్కరికి ఓటరు గా నమోదుకు అవగాహన కల్పించాలన్నారు. ఓటరు గా ఉన్నావారు వారియొక్క ఓటును ఓటరు జాబితాలోగాని ఆన్ లైన్ పోర్టల్ లో గాని చూసుకోవడం వలన ఎన్నికల సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నారు. ఇతర ప్రాంతాలకు వలసి వెళ్లినా లేదా ట్రాన్స పర్ అయిన, అడ్రసు, పేరు మార్పులు ఉన్నా ధరఖాస్తు చేసుకొని సరిచేసుకోవాలన్నారు. రాబోయే ఏడాది ఎన్నికల సంవత్సరం కావున 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు ను నమోదు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

జాయింట్ కలెక్టరు తేజ్ భరత్ మాట్లాడుతూ భారతీయ పౌరులందరికీ మనం దేశం ఓటు హక్కును కల్పించింది. 18 ఏళ్లు నిండిన వారందరు ఓటరు గా నమోదుకావాలన్నారు. ఓటర్లు భయం లేదా పక్షపాతం లేకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, భాగస్వామ్య, సమ్మిళిత మరియు అందుబాటులో ఉండే ఎన్నికలను నిర్ధారించడానికి భారత ఎన్నికల సంఘం తన ప్రయత్నంలో అవిశ్రాంతంగా కృషి చేస్తుందన్నారు.

మున్సిపల్ కమీషనరు కే.దినేష్ కుమార్ మాట్లాడుతూ ఓటు హక్కు వజ్రాయుధం లాంటిందని ప్రజలు మంచి పాలకులను ఎన్నుకునేందుకు ఓటు నిజమైన ఆయుధం అన్నారు. ఎలక్షన్ సమయంలో 60 నుంచి 65 శాతం మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కు ను సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో నూరు శాతం ఓటర్లు తమ ఓటును సద్వినియోగం చేసుకొవాలన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సంక్షేమం, అభివృద్ది దిశగా తీసుకువెళ్లే మంచి పాలకులను ఎన్నుకోవాలని సూచించారు. రాజమహేంద్రవరం నగరంలో 2 లక్షల 55 వేల ఓటర్లు ఉన్నారని వీరందరు వచ్చే ఎన్నికల్లో నూరు శాతం తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ సందర్బంగా నూతనంగా ఓటరు నమోదు అయిన విద్యార్థులకు జిల్లా కలెక్టరు చేతుల మీదుగా ఎపిక్ కార్డులు పంపిణీ చేసారు. అనంతరం జిల్లా స్థాయిలో వివిధ కళాశాలలు, పాఠశాలల్లో వ్యాసరచన, వ్యక్తృత్వ పోటీలు నిర్వహించిన విజేతలుగా గెలుపొందిన విద్యార్థులుకు బహుమతులను అందజేశారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు జాయింట్ కలెక్టరు, మున్సిపల్ కమీషనర్ పలువురు సీనియర్ సిటిజన్స్ కు శాలువా, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎలక్షన్ టీడీలు, బూత్ లెవెల్ అధికారులకు మెమెంటోలను అందించారు.

తొలుత కార్యక్రమంలో 13 జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు తమదైన శైలిలో ఎంతో ఉత్సహాంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, పలువులు ఓటు నమోదు ప్రక్రియ పై సందేశాలు ఇచ్చారు.

జిల్లా జాయింట్ కలెక్టరు తేజ్ భరత్, మున్సిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్ లు, జిల్లాలోని ఓటరు నమోదు సిబ్బంది, వివిధ కళాశాలల, వివిధ మండలాల రెవెన్యూ అధికారులు, పట్టణ విద్యాశాఖ అధికారి దిలీప్ కుమార్, పలువులు ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *