జగనన్న చేదోడు గా జిల్లాలోని 13491 మంది లబ్ధిదారుల ఖాతాకు రూ.13.49 కోట్లు జమ..

-జిల్లా కలెక్టర్ డా. మాధవీలత.
-కుల వృత్తులు వారికి జగనన్న ప్రభుత్వం లో అండగా నిలిచారు
-ఎంపి మార్గని భరత్ రామ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న చేదోడు పథకం క్రింద కుల వృత్తులు చేసుకునే రజక, నాయీ బ్రాహ్మణులు, టైలర్లు వృత్తి వారాలకు వరుసగా 3 వ విడతల్లో ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా అండగా నిలిచామని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఎంపి మార్గని భరత్ రామ్ లు పేర్కొన్నారు. సోమవారం జగనన్న చేదోడు రాష్ట్రస్థాయి కార్యక్రమం పల్నాడు జిల్లా వినుకొండలో జరిగే బహిరంగ సభ ద్వారా బటన్ నొక్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో మూడో విడత ఆర్థిక సహాయాన్ని జమ చేయగా, స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఎంపి తో పాటు డి సి సి బి చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఈ పథకం కింద తూర్పు గోదావరి జిల్లాలో దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రు.13.49 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం వారి ఖాతాలకు జమ చేసిందన్నారు. కుల వృత్తులు చేసుకునే కుటుంబాలకు నేరుగా ఆర్థిక సహాయం వారి బ్యాంకు ఖాతాలకు ఎటువంటి మధ్య వర్తులు లేకుండా వారి ఖాతాలోకి జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని వారి కుల వృత్తుల పెంచుకోవడం కోసం, ఆయా కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వడం జరిగిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ, జగనన్న చేదోడు పథకం కింద జిల్లాలో గత రెండు విడతలుగా 12181 మంది లబ్ధిదారులకు రూ. 22.12 కోట్లు అందజేయడం జరిగిందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి ఈ ఏడాది జిల్లాలో 13491 మంది లబ్ధిదారులకు రూ.13.49 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా సోమవారం జమ చేశామన్నారు. రాష్ట్ర స్థాయి లో 2022-23 ఆర్థిక సంవత్సరంగా సంబంధించి ఈ ఏడాది 3,30,145 మంది లబ్ధిదారులకు రూ. 330.14 కోట్లు వారి ఖాతాల్లో పల్నాడు జిల్లా వినుకొండ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న చేదోడు లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని వారు ఖాతాల్లో జమ చేశారన్నారు.

ఈ సమావేశంలో సూర్య బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కాలే రాజేశ్వర రావు, బి సి దేవంగుల డైరెక్టర్ మల్లేశ్వరి, జిల్లా బి సి సంక్షేమ అధికారి పి. సత్య రమేష్, ఏ ఏ ఓ జీ. సత్యనారాయణ, సిబ్బంది బి. రాజ కుమారి, పలువురు లబ్దిదారులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

వేమగిరికి చెందిన నాగదేవి :
వేమగిరికి చెందిన నాగదేవి మాట్లాడుతూ, జగనన్న చేదోడు ద్వారా ఒక కుట్టు మిషన్ కొనుగోలు చేసి స్వయం ఉపాధి పొందుతున్నానని, గత రెండు విడతలుగా అందిన సొమ్ముతో నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా మరో పది మందికి ఉపాధి ఇస్తున్నా అన్నారు. రెండో విడత సొమ్ముతో టైలరింగ్ కి సంబందించిన మెటీరియల్ కొనుగోలు చేసుకోవడం జరిగిందన్నారు. మూడో విడత సొమ్ముతో మరో మిషన్ కనుక్కోవాలని అనుకుంటున్నా అన్నారు. వారికి కూడా ఆదాయం పెరిగే అవకాశం జగనన్న చేదోడు ద్వారా కలుగానున్న దన్నారు. మా వంటి వారికి జగనన్న చేదోడు ఎంతో మేలు చేకూరుతుందని, ఇందుకు జగనన్న కి కృతజ్ఞతలు తెలుపుతూ, మీరే మళ్ళీ సిఎం గా రావాలని, మా మద్దతు మీకే అని పేర్కొన్నారు.

ధవళేశ్వరం కు చెందిన భాను వెంకట రమణ :
రజక వృత్తి చేసుకునే కుటుంబంన చెందిన కుటుంబం నుంచి రావడం జరిగిందన్నారు. డిగ్రీ వరకు చదివిన నేను స్వయం ఉపాధిగా కులవృత్తి చేసుకుంటూ, ఖాళీ సమయాల్లో పెయింటింగ్ వృత్తి చేసుకోవడం జరుగుతోందని అన్నారు. జగనన్న చేదోడు కింద గత రెండు విడతలుగా అందిన సొమ్ముతో రజక వృత్తి చేసుకునే పరికరాలు సమకుర్చుకున్నా అన్నారు.  మూడో విడత సొమ్ము తో పెయింటింగ్ కి చెందిన మెటీరియల్ కొనుగోలు చేసుకునే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. యువతకు జగనన్న చేదోడు అందించి అండగా ఉంటున్న జగన్ మోహన్ రెడ్డి కే మా ఓటు అన్నారు.

వేమగిరి కి చెందిన సిహెచ్. ప్రియాంక :
తన తండ్రి జీ. సత్యనారాయణ దివ్యాంగులని, టైలరింగ్ వృత్తి చేసుకోవడం జరుగుతోందని, ఐతే మా తండ్రీ టైలరింగ్ వృత్తి పట్ల ఆసక్తి ఉన్నా, ఎవ్వరూ ఆర్థిక సహాయం ఇచ్చేందుకు ముందుకు రాక పోవడంతో మా కుటుంబం ఎంతో ఆర్ధిక ఇబ్బందులలో ఉండే వన్నారు. జగనన్న ప్రభుత్వం వొచ్చిన తరువాత మా తండ్రికి వొచ్చే పెన్షన్ రూ.3 వేలకు పెరిగిందన్నారు. గత రెండు సంవత్సరాలుగా జగనన్న చేదోడు కింద రూ.10 వేలు రావడం జరిగిందన్నారు. ఇప్పుడు మూడో విడత లో మరో 10 వేలు రావడం తో మాతండ్రి సత్యనారాయణ ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు. గతంలో అడిగినా ఇవ్వని అధికారులు, అర్హత కలిగిన పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. నేడు దివ్యాంగులకు, కుల వృత్తుల వారికి జగనన్న అండగా ఉంటున్నారని మాకు ఆర్థిక భరోసా ఇస్తున్నారని అన్నారు.

మా అబ్బాయి చదువు కోవడానికి అమ్మ ఒడి, నాకు డ్వాక్రా రుణాలకు చెందిన వై ఎస్ ఆర్ ఆసరా కింద రూ.12 వేలు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. మా మద్దతు ఎప్పటికీ జగనన్నకు ఉంటుందనీ అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *