-ఘనంగా నివాళులు అర్పించిన కలెక్టర్, ఎంపి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సత్యము, అహింసలే ఆయుధంగా భారత దేశానికి స్వాతంత్ర్యయం సముపార్జించిన మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లాలో కలెక్టర్ డా. కె. మాధవీలత, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ రామ్ లు పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లాలో కలెక్టర్ కార్యాలయ స్పందన హల్లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన. చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, నేటి యువత , బాల బాలికలు సత్యం, అహింస, ధర్మం పట్ల అవగాహన కలిగి వుండాలన్నారు. అందుకు మహాత్మా గాంధీ వంటి వారి జీవితాల గురించి తెలుసుకుని స్పూర్తి పొందాలని సూచించారు. ఎంపి మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యము కోసం అహింసా మార్గంలో పయనించి దేశానికి స్వాతంత్య్రం సాధించి, ప్రపంచానికే ఆదర్శం గా నిలిచారన్నారు. చిన్నారుల్లో జాతీయ నాయకుల చరిత్రను తెలియ చేసి వారిలో జాతీయ భావాన్ని పెంపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో జాయింట్ కలక్టర్ ఎన్.తేజ్ భరత్, డిఆర్ఓ జి. నరసిరావు , జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News