స్పందనలో వచ్చిన అర్జీలను పరిష్కరించే విధంగా క్షేత్రస్థాయి లోని ఉన్నతాధికారుల పర్యవేక్షణ వుండాలి

-ఈరోజు స్పందనలో వచ్చిన అర్జీలు 160
-నిర్ణీత కాలవ్యవధిలో వాటిని పరిష్కరించాలి.
-ఏ ఒక్క అర్జీ పునర్ ప్రారంభం కాకుండా పరిష్కారం చెయ్యాలి
-జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత సమయంలో నాణ్యతతో కూడీన విధంగా క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత అధికారులు ఆదేశించారు. అర్హత కలిగిన అర్జీదారులకు సకాలంలో న్యాయం చేయాల్సి ఉంటుందన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో  కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లు వివిధ సమస్యలు పరిష్కారం నిమిత్తం ప్రజల నుంచి 160 అర్జీలు స్వీకరించామన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ స్పందన లో వచ్చిన అర్జీలలో రాష్ట్ర స్థాయిలో పరిష్కారం నిమిత్తం ఉన్న వాటిని సంబందిత ఉన్నత స్థాయి అధికారులు ఆన్ లైన్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. జగనన్న కి చెబుదాం (జెకెసి)లో వచ్చిన అర్జీలు 1902 కాల్ సెంటర్ కు పంపడం జరుగు తుందన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో కూడిన పరిష్కారాన్ని అందించాలన్నారు.  రీ ఓపెన్ అర్జీలు పరిష్కారం నిమిత్తం  ఎగువ స్థాయి అధికారులకు వస్తాయని ఒకే సమాధానం అయిప్పటికీ పూర్తి స్థాయిలో పరిశీలించి  సమగ్రంగా నివేదిక ఆన్ లైన్ లో అప్ లోడ్  చేయాలన్నారు.   జిల్లా అధికారులు వ్యక్తిగత భాద్యతతో అర్జీలను పరిష్కరించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి , పభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షలు నిర్వహిస్తున్నందున జిల్లా అధికారులు శాఖలు వారి అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలు పై ప్రగతి నివేదికలు సమీక్షలకు ముందు గానే అందించే విధంగా సమాయత్తం కావాలన్నారు.   జిల్లాలోని ప్రతి కార్యాలయం లో పనిచేస్తున్న అధికారులు సిబ్బందికి సంబంధించి ముఖ చిత్ర హాజరు (FRS) రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు.

జిల్లాలో స్పందన కి ఇప్పటి వరకు 342 అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని వాటిలో 11 ఫిర్యాదులు తిరిగి రావడం జరిందన్నారు. పెండింగ్ అర్జిలో 48 గంటల్లోగా పరిష్కారం చేయాల్సినవి 3 అర్జీలు, 24 గంటల్లో పరిష్కరించాల్సినవి 6 , ఐదు రోజుల్లోగా పరిష్కారం చేయాల్సినవి అర్జీలు 16 ఉన్నాయని  కలెక్టరు తెలిపారు.

స్పందనలో  వచ్చిన కొన్ని అర్జీలు :-
గోకవరం మండలం కామరాజుపేట గ్రామంకు చెందిన ఎస్ వి. సత్యనారాయణ తమ అర్జీలో రహదారి కొరకు తన ఇంటి వెనకాల వున్న కంచెను తొలగించి ఇప్పటికి మూడేళ్లు అవుతోందని, ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. డాక్యూమెంట్ ప్రకారం ఇంటి సరిహద్దు కంచి ఉన్న స్థలంలోనే ఉందని, అధికారులు తొలగించిన కంచెను తిరిగి నిర్మించాలని కోరారు. మాధవీలత కలెక్టర్ స్పందిస్తూ ఎంపిడిఓ అర్జీదారుని సమస్య ను పరిష్కరించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

సీతానగరం మండలం ఉండేశ్వరపురం గ్రామ నివాసి పెంటపాటి సత్యవతి తమ అర్జీలో తన భర్త నాగేశ్వరరావు 2019 లో మరణించారని బియ్యం అందించే రేషన్ కార్డు లో తన భర్త తో పాటు తన పేరు కూడా తొలగించడం వలన ప్రభుత్వ పధకాలు ఏమి అందటం లేదని తిరిగి తన కార్డు పునరుద్దించాలని కోరారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిఎస్ఓ ను కలెక్టర్ ఆదేశించారు.

దేవరపల్లి మండలం యాదవోలు గ్రామ రైతు ఇంటి సుబ్బారావు తమ అర్జీలో గ్రామంలో సర్వే నం 558/4 లో 1.28 సెంట్లు భూమిని కలిగి వున్నాను. సర్వే చేసి నాయొక్క భూమిని ఇప్పించాలని అర్జీలో కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రైతు సమస్యను వెంటనే పరిష్కరించి నివేదిక సమర్పించాలని కొవ్వూరు ఆర్డీఓ, సర్వే అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

నిడదవోలు మండలం నిడదవోలు బాపూజీనగర్ నివాసి షేక్ ఖాదర్ ఉన్నిసా తమ అర్జీలో 2018 నుంచి తనకు ఒంటరి పెన్షన్ ఇస్తున్నారని, అయితే ఈ మధ్య రేషన్ కార్డు వెరిఫికేషన్ లో తన భర్త వున్నారని పెన్షన్ నిలుపుదల చేశారు. తదుపరి రేషన్ కార్డు లో తన భర్తను తొలగించి కార్డు ఇచ్చారు. అయినప్పటికీ ఇంకా పెన్షన్ పునరుద్ధరణ చేసి ఇవ్వడం లేదన్నారు. కావున నాకు గతంలో లాగే పెన్షన్ అందించాలని కోరారు. సమస్యను పరిష్కరించి అర్జీదారుని కి పెన్షన్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్..డిఆర్డిఏ పి. డి. ని కలెక్టర్ ఆదేశించారు.

ఈ స్పందన కార్యక్రమం జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డీఆర్వో  జి.  నరశింహులు,  డి ఎం హెచ్ ఓ డా. కే వెంకటేశ్వరరావు, టీబి, ఏయిడ్స్ కంట్రోలింగ్ అధికారి డా. ఎన్. వసుందర, డిసిహెచ్ఒ డా.సనత్ కుమారి, సీపీఓ కె.ప్రకాష్ రావు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ ఈ  డి.బాలశంకర్ ,  డీ పి వో  పి. జగదాంబ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవ రావు, పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్ జీ టి సత్యగోవిందం, డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్, డిఆర్డిఏ పీడి ఎస్. సుమలత డి ఎల్ డిఓ వీణాదేవి, జిల్లా ట్రెజరీ అధికారి సత్యనారాయణ, పలువురు జిల్లా శాఖా అధికారులు , సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *