-జోన్2 డైరీ 2023ను ఆవిష్కరించిన డీటీసీ యం పురేంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక బందర్ రోడ్ లోని డిటిసి కార్యాలయంలో సోమవారంనాడు రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం రాజుబాబు ఆధ్వర్యంలో ఆ సంఘం జోన్2 డైరీ ని డీటీసీ యా పురేంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిటిసి ఎం పురేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్లను జీవోలను ఈ డైరీలో ప్రచురించడం ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుందని రోజువారి చేసేటివంటి విధి నిర్వహణలో కూడా దీని ద్వారా ఉద్యోగులకు అవగాహన పెరుగుతుందని ఆయన అన్నారు. సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు మాట్లాడుతూ శాఖపరమైన విధి విధానాల అమలులో ఉద్యోగులకు అవగాహన ఉన్నప్పటికీని ఒక్కొక్కసారి పూర్తిస్థాయిలో దానిమీద పనిచేయాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించి ప్రభుత్వం జీవోలు గాని సర్కులర్స్ గాని కావాల్సి వస్తాయని, అటువంటి వాటిలో ముఖ్యమైన సమాచారం ను కూడా అధికారులకు ఉద్యోగులకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ డైరీని రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో ఆర్ జగదీశ్వర్ రాజు, శిక్షణ పొందుతున్న ఆర్టీవోలు ఎ సునీల్, వై చందన, జి మనీషా, టెక్నికల్ అధికారుల సంఘం నాయకులు ఆర్ ప్రవీణ్, వెంకటేశ్వరరావు సంఘం జోనల్ కార్యదర్శి కె వి వి నాగ మురళి ఏవోలు సిహెచ్ శ్రీనివాసరావు అబ్దుల్ సత్తార్ ఉద్యోగులు ఉన్నారు.
Prajavartha Online Telugu News