ఎయిర్ పోర్ట్ కారిడార్ నిర్మాణ పనుల పరిశీలన…

-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి జాతీయ రహదారి వెంట చేపడుతున్న గన్నవరం ఎయిర్ పోర్ట్ కారిడార్ పనుల యొక్క నాణ్యత విషయంలో ఏవిధమైన రాజీ లేకుండా ఎప్పటికప్పుడు వాటి నాణ్యత ప్రమాణాలు స్వయంగా పరిశీలించి పనుల యొక్క వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు ఇచ్చి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం రామవరప్పాడు రింగు, ప్రసాదంపాడు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి మెటీరియల్ త్వరగా తెప్పించుకుని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, టైల్స్ యొక్క అంచులు పగిలిపోవడం గమనించి టైల్స్ ను పగలకుండా జాగ్రత్త చూసి వేయాలని మరియు మద్య మద్యలో ఖాళీగా ఉన్న కర్బ్ వాల్స్ ను కట్టి టైల్స్ ను వేయాలని, మరియు వాటి నాణ్యత ప్రమాణాలు పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చియున్నారు. కారిడార్ పనులను వాటి యొక్క వివరాలను మరియు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అడిగితెలుసుకొని పలు సూచనలు చేసినారు. ఇంకా రామవరప్పాడు రింగు నుండి నిడమానూరు జంక్షన్ వరకు 3.5 కిలోమీటర్ల మేరకు జరగవలసిన పనులను 10 రోజుల లోపు పూర్తి చేయాలనీ అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ పర్యటనలో ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్లు ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *